ఆల్మండ్ కోఫ్తా
ABN, First Publish Date - 2020-02-22T18:08:26+05:30
బంగాళదుంపలు - నాలుగు, జాజికాయ పొడి - చిటికెడు, పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - ముప్పావు కప్పు, పిండి - ఒక కప్పు
కావలసినవి : బంగాళదుంపలు - నాలుగు, జాజికాయ పొడి - చిటికెడు, పాలు - రెండు టేబుల్‌స్పూన్లు, బాదం పలుకులు - ముప్పావు కప్పు, పిండి - ఒక కప్పు, కోడిగుడ్లు - మూడు, ఉప్పు - కొద్దిగా, మిరియాల పొడి - అర టీస్పూన్, బ్రెడ్ ముక్కలు - కొన్ని.
తయారీ : ముందుగా బంగాళదుంపలు ఉడికించాలి. పొట్టు తీసి గుజ్జుగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి. అందులో బాదం పలుకులు, ఉప్పు, మిరియాలపొడి, జాజికాయ పొడి, పాలు, పిండి, రెండు కోడిగుడ్లు కొట్టి వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో పావుగంట పాటు పెట్టాలి. తరువాత కోఫ్తాలుగా కట్ చేసుకోవాలి.
ఒక ప్లేటులో పొడి పిండి, మరొక ప్లేటులో కోడిగుడ్డు సొన, ఇంకో ప్లేటులో బ్రెడ్ ముక్కలు తీసుకోవాలి. ఒక్కో కోఫ్తాను తీసుకుంటూ పిండిలో అద్ది, కోడిగుడ్డు సొనలో అద్దాలి. తరువాత బ్రెడ్‌ముక్కలపై దొర్లించాలి. ఈ కోఫ్తాలను ప్రీ హీట్ ఓవెన్‌లో పెట్టి ఉడికించి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.
Updated Date - 2020-02-22T18:08:26+05:30 IST