క్యారెట్ అన్నం
ABN, First Publish Date - 2020-03-15T15:57:42+05:30
క్యారెట్ తురుము - ఒక కప్పు, బాస్మతి బియ్యం - ఒక కప్పు, సాంబార్ పొడి - ఒకటిన్నర టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - చిటికెడు, గరంమసాలా - చిటికెడు, కొత్తిమీర
కావలసినవి :
క్యారెట్ తురుము - ఒక కప్పు, బాస్మతి బియ్యం - ఒక కప్పు, సాంబార్ పొడి - ఒకటిన్నర టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, పసుపు - చిటికెడు, గరంమసాలా - చిటికెడు, కొత్తిమీర - కొద్దిగా, జీలకర్ర - అర టీస్పూన్, నూనె - ఒక టేబుల్‌స్పూన్.
తయారీ :
ముందుగా బాస్మతి బియ్యంను శుభ్రంగా కడిగి అన్నం వండుకోవాలి. అన్నం ఉడికే సమయంలోనే కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె వేయాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక జీలకర్ర,ఉల్లిపాయలు వేసి వేగించాలి. ఉల్లిపాయలు వేగాక క్యారెట్ తురుము వేయాలి.సాంబార్ పొడి, పసుపు, ఉప్పు వేసి కలిపి ఐదు నిమిషాలపాటు చిన్నమంటపై ఉడికించాలి.ఇప్పుడు గరంమసాలా వేసి దించాలి. వండి పెట్టుకున్న అన్నంలో ఈ మిశ్రమాన్ని కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరంగా ఉంటుంది.
Updated Date - 2020-03-15T15:57:42+05:30 IST