ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుత్తి వంకాయ కూర

ABN, First Publish Date - 2020-10-17T18:42:00+05:30

వంకాయ.. తెలుగువారు ఎక్కువగా ఇష్టపడే కూరగాయల్లో ఒకటి. అందుకే ‘‘వంకాయ వంటి కూరయు..పంకజముఖి సీత వంటి భార్యామణియున్‌.. శంకరుని వంటి దైవము.. లంకాధిపు వైరి వంటి రాజును కలరే!’’ అని ఒక కవి పద్యం కూడా చెప్పేశాడు. అలాంటి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వంకాయ...రుచుల మాయ

వంకాయ.. తెలుగువారు ఎక్కువగా ఇష్టపడే కూరగాయల్లో ఒకటి. అందుకే ‘‘వంకాయ వంటి కూరయు..పంకజముఖి సీత వంటి భార్యామణియున్‌.. శంకరుని వంటి దైవము.. లంకాధిపు వైరి వంటి రాజును కలరే!’’  అని ఒక కవి పద్యం కూడా చెప్పేశాడు. అలాంటి వంకాయతో 36 రకాల వంటలు చేయవచ్చంటారు పాక శాస్త్ర నిపుణులు. వాటిని తిన్నప్పుడు కలిగే ఆనందమే వేరంటారు తెలుగువారు. 


అలాంటి కొన్ని వంటలను ఎలా చేయాలో- హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌ ఎగ్జిక్యూటివ్‌ చెఫ్‌ వెంకట్‌ ‘నవ్య’ పాఠకులకు అందిస్తున్నారు. 


కావలసినవి: చిన్న వంకాయలు - 600 గ్రాములు, ఉల్లిపాయలు - 200గ్రా, టొమాటో - 200గ్రా, నువ్వులు - 100గ్రా, కారం - 20గ్రా, పసుపు - 10గ్రా, కొబ్బరి పొడి - 100గ్రా, వేరుశనగలు - 100 గ్రా, ఆవాలు - 20గ్రా, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 400ఎం.ఎల్‌, చింతపండు రసం - 25 ఎంఎల్‌, కొత్తిమీర - ఒకకట్ట.


తయారీ విధానం: ముందుగా వంకాయలను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక వంకాయలు వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి. వేరుశనగలు, కొబ్బరి పొడి, నువ్వులు, ఆవాలను మరొక పాన్‌లో నూనె లేకుండా వేగించుకుని పొడి చేసి పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి వేడి అయ్యాక ఉల్లిపాయలు వేసి వేగించాలి. ఇప్పుడు గ్రైండ్‌ చేసి పెట్టుకున్న మసాలా పొడి, వేగించి పెట్టుకున్న వంకాయలు వేయాలి. తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. చింతపండు రసం పోసి కాసేపు ఉడికించాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్‌ చేసుకుని దింపాలి.


వంకాయ 100 గ్రాములలో

క్యాలరీలు - 24

ప్రొటీన్‌ - 1 గ్రాము

కార్బోహైడ్రేట్లు - 6 గ్రాములు

ఫైబర్‌ - 3 గ్రాములు 

ఫ్యాట్‌ - 0.19 గ్రాములు

సోడియం - 2 మైక్రోగ్రాములు

పొటాషియం - 230 మైక్రోగ్రాములు


Updated Date - 2020-10-17T18:42:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising