హరా బరా కబాబ్
ABN, First Publish Date - 2020-08-08T21:45:56+05:30
ఉడికించిన బంగాళదుంపలు - 2 కప్పులు, పాలకూర బరక పేస్టు, బఠాణి పేస్టు, పనీర్ తురుము - పావు కప్పు చొప్పున
కావలసిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంపలు - 2 కప్పులు, పాలకూర బరక పేస్టు, బఠాణి పేస్టు, పనీర్ తురుము - పావు కప్పు చొప్పున, కొత్తిమీర తరుగు - ఒక టేబుల్ స్పూను, ఆమ్‌చూర్ - ఒక టీ స్పూను, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను, మిర్యాల పొడి, జీరాపొడి, గరం మసాల - అర టీ స్పూను చొప్పున, ఉప్పు - రుచికి తగినంత, కార్న్‌ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు, బ్రెడ్ పొడి - పావు కప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పైన ఉదహరించిన పదార్థాల్లో నూనె తప్పించి మిగతావన్నీ ఒక వెడల్పాటి లోతైన పాత్రలో ఒకటి తర్వాత ఒకటి వేసి బాగా కలిపి నీరు పోయకుండా ముద్దగా చేయాలి. తర్వాత నిమ్మకాయంత మిశ్రమం తీసుకుని కబాబ్‌లా చేతిలో ఒత్తి మధ్యలో ఇష్టమైతే జీడిపలుకు నొక్కి, బ్రెడ్ పొడిలో అద్దాలి. తర్వాత నూనెలో దోరగా వేగించాలి. వీటికి పుదీనా చట్నీ మంచి కాంబినేషన్.
Updated Date - 2020-08-08T21:45:56+05:30 IST