మామిడికాయ సేమ్యా ఉప్మా
ABN, First Publish Date - 2020-06-04T17:00:08+05:30
వర్మిసెల్లి - 1 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు - 4, అల్లం - చిన్నముక్క, పచ్చిమామిడికాయ తురుము - ముప్పావు కప్పు, బాదం గింజలు
కావలసినవి: వర్మిసెల్లి - 1 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు - 4, అల్లం - చిన్నముక్క, పచ్చిమామిడికాయ తురుము - ముప్పావు కప్పు, బాదం గింజలు - 10, నూనె - అరటేబుల్ స్పూను, నెయ్యి - అరటేబుల్ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, ఆవాలు - టేబుల్ స్పూను, మినపప్పు - అర టేబుల్ స్పూను, దాల్చిన చెక్క - చిన్న ముక్క, కరివేపాకు - 2 రెమ్మలు
తయారీ: నాలుగు కప్పుల నీళ్లను కడాయిలో పోసి మరగనిచ్చి అందులో వర్మిసెల్లి, అరటేబుల్ స్పూను ఉప్పు, టేబుల్ స్పూను నూనె వేయాలి. ఉడికిన వర్మిసెల్లీని చిల్లుల గిన్నెలో పోసి నీరంతా వడకట్టాలి. ఆరాక పైన చల్లటి నీళ్లు పోసి పక్కనపెట్టాలి. కడాయిలో నూనె, నెయ్యి వేసి వేడయ్యాక ఆవాలు, మినపపప్పు, దాల్చినచెక్క, బాదం వేసి వేగించాలి. అందులో చీల్చిన పచ్చిమిరకాయలు, అల్లం పేస్ట్‌లను కలపాలి. నాలుగు నిమిషాలు వేగించాక మామిడి కాయ తురుము వేసి కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఉడికించి ఉంచిన వర్మిసెల్లీని కొంచెం కొంచెంగా వేస్తూ ఉండలుగా చుట్టుకుపోకుండా కలుపుతూ ఉండాలి. అంతే మ్యాంగో, వెర్మిసెల్లీ ఉప్మా రెడీ! చట్నీ లేదా పచ్చడితో వేడివేడిగా వడ్డించుకుంటే సరి!
Updated Date - 2020-06-04T17:00:08+05:30 IST