ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిక్చర్‌

ABN, First Publish Date - 2020-05-04T19:26:46+05:30

బజ్జీవాలా బండి మీద మరమరాల మిక్చర్‌ చూడగానే తినాలనిపిస్తుంది. ఇంటిల్లిపాదికి మరమరాల మిక్చర్‌ మంచి స్నాక్‌. కారంకారంగా ఎంతో రుచిగా ఉండే మరమరాల మిక్చర్‌ను కొన్ని దినుసులతో ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(04-05-2020):

బజ్జీవాలా బండి మీద మరమరాల మిక్చర్‌ చూడగానే తినాలనిపిస్తుంది. ఇంటిల్లిపాదికి మరమరాల మిక్చర్‌ మంచి స్నాక్‌. కారంకారంగా ఎంతో రుచిగా ఉండే మరమరాల మిక్చర్‌ను కొన్ని దినుసులతో ఇంట్లోనే సింపుల్‌గా తయారుచేసుకోవచ్చు.


కావలసినవి: మరమరాలు - పావుకిలో, వేయించిన పల్లీలు - అర కప్పు, బాదం - పావుకప్పు, వేయించిన ముడిసెనగలు - ముప్పావు, కప్పు, తురిమిన ఎండుకొబ్బరి - అరకప్పు, పచ్చిమిరప కాయలు - ఆరు, కరివేపాకు - కొంచెం, పంచదార - టేబుల్‌ స్పూను, పసుపు - పావు స్పూను, కారం - అర స్పూను, నూనె - 5 టేబుల్‌ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత 


తయారీ: కడాయిలో నూనె వేసుకోవాలి. ముందు అన్ని రకాల పప్పు గింజలను నూనెలో దోరగా వేగించి పక్కనపెట్టుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి, కరివేపాకును విడివిడిగా వేగించి పక్కనపెట్టుకోవాలి. తరువాత అదే నూనెలో కొబ్బరి తురుమును వేసి వేగించాలి. ముందుగా వేగించిన పప్పు గింజలు, కరివేపాకు, పచ్చిమిర్చిని ఇందులో కలుపుకోవాలి. పసుపు, ఉప్పు, పంచదార, కారం వేసి బాగా కలపాలి. చివరగా మరమరాలు వేసి బాగా కలిపి చిన్న మంట మీద రెండు నిమిషాల పాటు కలుపుతూ వేగించాలి. అంతే మరమరాల మిక్చర్‌ రెడీ. చల్లారాక సర్వ్‌ చేసుకోవాలి. 


Updated Date - 2020-05-04T19:26:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising