ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముల్లంగి వేపుడు

ABN, First Publish Date - 2020-12-05T19:03:34+05:30

ముల్లంగి - నాలుగు, బంగాళదుంపలు - రెండు, టొమాటోలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - ఎనిమిది రెబ్బలు, ఎండుమిర్చి - మూడు, జీలకర్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: ముల్లంగి - నాలుగు, బంగాళదుంపలు - రెండు, టొమాటోలు - రెండు, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి - ఎనిమిది రెబ్బలు, ఎండుమిర్చి - మూడు, జీలకర్ర - అర టీస్పూన్‌, కారం - అర టీస్పూన్‌, ధనియాల పొడి - అర టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - రుచికి తగినంత, వాము - అర టీస్పూన్‌.


తయారీ విధానం: ముల్లంగి, బంగాళదుంపల పొట్టు తీసి శుభ్రంగా కడగాలి. తరువాత వాటిని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఇంగువ, జీలకర్ర, వాము, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసి వేగించాలి. తరిగిన ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, తగినంత ఉప్పు వేసి  కలపాలి. కాసేపు ఉడికిన తరువాత పసుపు, ధనియాల పొడి, కారం వేసుకోవాలి. ఇప్పుడు ముల్లంగి, బంగాళదుంపల ముక్కలు వేసి మరో ఐదు నిమిషాల పాటు వేగించాలి. గ్రేవీ కావాలనుకుంటే కొద్దిగా నీళ్లు పోసుకోవచ్చు. చిన్నమంటపై అరగంటపాటు ఉడికించిన తరువాత కొత్తిమీర వేసుకుని అన్నంతో పాటు వడ్డించాలి.


ముల్లంగిలో...

ప్రోటీన్లు - 0.7 గ్రా

క్యాలరీలు - 16

కార్బోహైడ్రేట్లు - 3.4 గ్రా

Updated Date - 2020-12-05T19:03:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising