పెసర పునుకులు
ABN, First Publish Date - 2020-08-14T19:22:57+05:30
పెసరపప్పు - ఒక కప్పు, మినపప్పు - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అరకప్పు,
కావలసిన పదార్థాలు: పెసరపప్పు - ఒక కప్పు, మినపప్పు - రెండు టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర - ఒక టీ స్పూను, అల్లం - రెండంగుళాల ముక్క, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: పెసరపప్పు, మినప్పప్పు కలిపి 3 గంటలు నానబెట్టి నీరు వడకట్టాలి. తర్వాత పప్పుల్లో అల్లం ముక్కలు వేసి గట్టిగా పేస్టు చేసుకోవాలి. ఈ పేస్టులో ఉప్పు, ఉల్లి తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. తర్వాత బాగా కాగిన నూనెలో తడి చేత్తో పిండిని పునుకులుగా వేసి దోరగా వేగించాలి. వీటికి నిమ్మకాయ పచ్చడి మంచి కాంబినేషన్.
Updated Date - 2020-08-14T19:22:57+05:30 IST