పోహా కట్‌లెట్
ABN, First Publish Date - 2020-08-29T20:19:35+05:30
అటుకులు - ఒక కప్పు, నీళ్లు, అరకప్పు, బంగాళదుంపలు - రెండు, పెరుగు - ఒక టేబుల్‌స్పూన్, ఉల్లిపాయలు
కావలసినవి: అటుకులు - ఒక కప్పు, నీళ్లు, అరకప్పు, బంగాళదుంపలు - రెండు, పెరుగు - ఒక టేబుల్‌స్పూన్, ఉల్లిపాయలు - రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్, కారం - ఒక టీస్పూన్, ధనియాల పొడి - ఒకటిన్నర టీస్పూన్, జీలకర్ర పొడి - ఒక టీస్పూన్, పసుపు - పావు టీస్పూన్, పచ్చిమిర్చి - రెండు, కొత్తిమీర - కొద్దిగా, ఉప్పు - తగినంత.
తయారీ: బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి. ఒక పాత్రలో అటుకులు తీసుకొని అందులో అరకప్పు నీళ్లు పోయాలి. కొద్దిసేపు అటుకులను నానబెట్టాలి. తరువాత అందులో ఉడకబెట్టిన బంగాళదుంపల గుజ్జు వేసి కలియబెట్టాలి. పెరుగు, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ కట్‌లెట్స్‌గా చేసుకోవాలి. స్టవ్‌పై పాన్ పెట్టి కాస్త వేడి అయ్యాక కట్‌లెట్స్ వేసి మూత పెట్టి ఉడికించాలి. కాసేపు ఉడికిన తరువాత మరోవైపు తిప్పాలి. రెండు వైపులా బాగా కాలిన తరువాత వేడి వేడిగా సర్వ్ చేయాలి.
Updated Date - 2020-08-29T20:19:35+05:30 IST