బూడిద గుమ్మడి కర్రీ
ABN, First Publish Date - 2020-05-04T17:08:55+05:30
బూడిద గుమ్మడి ముక్కలు - 100 గ్రా., జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - 5, పుట్నాలు - 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, అల్లం - అర అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - అరకప్పు, పచ్చికొబ్బరి తురుము -
కావలసిన పదార్థాలు: బూడిద గుమ్మడి ముక్కలు - 100 గ్రా., జీలకర్ర - 1 టీ స్పూను, మిరియాలు - 5, పుట్నాలు - 3 టీ స్పూన్లు, పచ్చిమిర్చి - 4, అల్లం - అర అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు - అరకప్పు, పచ్చికొబ్బరి తురుము - అరకప్పు, నూనె - 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు - 1 టీ స్పూను, శనగపప్పు - 2 టీ స్పూన్లు, ఎండుమిర్చి - 1, కరివేపాకు - 4 రెబ్బలు, పసుపు - అర టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, పెరుగు - అరకప్పు.
తయారుచేసే విధానం: ముందుగా ఒక గ్లాసు నీటిలో బూడిద గుమ్మడి ముక్కలను 10 నిమిషాలు ఉడికించి పక్కనుంచాలి. మిక్సీలో జీలకర్ర, మిరియాలు, అల్లం, పుట్నాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పచ్చికొబ్బరి వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేగించి కొబ్బరి మిశ్రమం కూడా వేసి 2 నిమిషాల తర్వాత అరగ్లాసు నీరు, పసుపు, ఉప్పు, ఉడికించిన గుమ్మడి ముక్కలు వేయాలి. అవసరం అనుకుంటే మరో అరకప్పు నీరు పోయాలి. కూర చిక్కబడ్డాక దించి, చల్లారిన తర్వాత పెరుగు కలిపి వడ్డించాలి.
Updated Date - 2020-05-04T17:08:55+05:30 IST