రిబ్బన్ పకోడీ!
ABN, First Publish Date - 2020-04-16T16:48:22+05:30
అస్తమానం ఒకే రకం తిండి తిని బోర్ కొడితే వెరైటీగా రిబ్బన్ పకోడీ ట్రై చేయవ చ్చు. తక్కువ సమయంలో ఈజీగా వండుకోవచ్చు. ఒక్కసారి చేసుకొని మూత ఉన్న డబ్బాలో పెడితే 15 రోజుల పాటు తినొచ్చు.
అస్తమానం ఒకే రకం తిండి తిని బోర్ కొడితే వెరైటీగా రిబ్బన్ పకోడీ ట్రై చేయవ చ్చు. తక్కువ సమయంలో ఈజీగా వండుకోవచ్చు. ఒక్కసారి చేసుకొని మూత ఉన్న డబ్బాలో పెడితే 15 రోజుల పాటు తినొచ్చు.
కావలసినవి: బియ్యం పిండి - కప్పు, శనగపిండి - పావు కప్పు, ఇంగువ, ఉప్పు, కారం- తగినంత, జీలకర్ర - అర స్పూన్, పచ్చిమిరప - 2, అల్లం - కొంచెం, ఆయిల్ - డీప్‌ఫ్రైకు తగినంత
తయారీ: ఒక పాత్ర తీసుకొని అందులో అన్ని రకాల పిండిని పోసి బాగా కలపాలి. అందులో రెండు స్పూన్ల వేడి నూనె వేసి మళ్లీ కలపాలి. దీనికి తగినంత నీటిని కలిపి చేతికి అంటుకోకుండా, మృదువుగా సాగే వరకూ పిండిని కలపాలి. రిబ్బన్ పకోడా ప్లేట్‌కు నూనెపూసి, అచ్చులో ఉంచి, పిండితో నింపాలి. కడాయిలో నూనె పోసి బాగా మరిగాక అచ్చును గుండ్రంగా తిప్పుతూ పిండిని ఒత్తాలి. తగు మాత్రంగా వేగించి బయటకు తీసి కిచెన్ టిష్యూ మీద ఉంచి బాగా ఆరనివ్వాలి. అంతే రిబ్బన్ పకోడీ రెడీ! తరువాత కావలసిన విధంగా ముక్కలు చేసి మూత ఉన్న డబ్బాలో ఉంచాలి.
Updated Date - 2020-04-16T16:48:22+05:30 IST