సేమియా పకోడి
ABN, First Publish Date - 2020-10-21T17:57:46+05:30
సేమియా - ఒక కప్పు, కరివేపాకు తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను, ఉల్లి తరుగు - ఒక కప్పు, కారం - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, శనగపిండి
కావలసిన పదార్థాలు: సేమియా - ఒక కప్పు, కరివేపాకు తరుగు - అరకప్పు, పచ్చిమిర్చి తరుగు - ఒక టీ స్పూను, ఉల్లి తరుగు - ఒక కప్పు, కారం - ఒక టీ స్పూను, ఉప్పు - రుచికి సరిపడా, శనగపిండి - ముప్పావు కప్పు, కొత్తిమీర తరుగు - అరకప్పు, నూనె - వేగించడానికి సరిపడా.
తయారుచేసే విధానం: 4 కప్పుల నీరు మరిగించి సేమియా వేసి పలుకుమీద ఉడికించి దించేయాలి. ఇప్పుడు వడకట్టి మిక్సింగ్ బౌల్‌లో వేసి కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగులు, ఉప్పు, కారం, శనగపిండి వేసి నీరు కలపకుండా బాగా కలపాలి. తర్వాత నూనె బాగా కాగిన తర్వాత మాత్రమే పకోడీలు వేసి మీడియం ఫ్లేమ్‌లో వేగించాలి. వీటికి నిమ్మకారం చాలా మంచి కాంబినేషన్.
Updated Date - 2020-10-21T17:57:46+05:30 IST