ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేమియా ఉప్మా!

ABN, First Publish Date - 2020-04-22T16:44:59+05:30

గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఉప్మా మనకు తెలుసు. ఈసారి కొంచెం వెరైటీగా సేమియా ఉప్మాను ట్రై చేద్దాం. దీన్నే వెర్మీసెల్లీ ఉప్మా అని కూడా అంటారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(22-04-2020)

గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఉప్మా మనకు తెలుసు. ఈసారి కొంచెం వెరైటీగా సేమియా ఉప్మాను ట్రై చేద్దాం. దీన్నే వెర్మీసెల్లీ ఉప్మా అని కూడా అంటారు. ఉప్మాలో వాడిన దినుసులనే వీటి తయారీలోనూ వాడతారు. కొద్ది సమయంలో సింపుల్‌గా సేమియా ఉప్మా చేయవచ్చు. 


కావలసినవి: సేమియా - కప్పు, నీళ్లు - కప్పు, ఉప్పు - తగినంత, ఉల్లిపాయ - 1, పచ్చిమిరప - 1, అల్లం - చిన్నముక్క, నూనె లేదా నెయ్యి - 2 టేబుల్‌ స్పూన్లు, వేరుశనగలు - 2 టేబుల్‌ స్పూన్లు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు- పోపులోకి


తయారీ: కడాయిలో నూనె పోసి పోపు దినుసులు, వేరుశనగలు వేసి వేగించాలి. దానికి ఉల్లిపాయ, పచ్చిమిరప ముక్కలు, కరివేపాకు కలిపి దోరగా వేగించాలి. అందులో సేమియా పోసి సన్నమంట మీద గరిటెతో బాగా కలుపుతూ వేగించి పక్కనపెట్టుకోవాలి. మరోపాత్రలో నీటిని పోసి ఉప్పు కలిపి వేడిచేసుకోవాలి. వాటిని వేగించిన సేమియా తాలింపులో కలుపుకుని నీరంతా ఇగిరిపోయేదాకా గరిటెతో కలియతిప్పాలి. దీంతో సేమియా ఉప్మా రెడీ. పచ్చడి, పెరుగుతోనూ దీన్ని తినొచ్చు. 

Updated Date - 2020-04-22T16:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising