ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలకూర కబాబ్స్‌

ABN, First Publish Date - 2020-08-08T19:06:35+05:30

పాలకూర - రెండు కట్టలు, బంగాళదుంపలు - రెండు, పచ్చిబఠాణీ - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, పసుపు - చిటికెడు, యాలకుల పొడి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: పాలకూర - రెండు కట్టలు, బంగాళదుంపలు - రెండు, పచ్చిబఠాణీ - పావు కప్పు, పచ్చిమిర్చి - రెండు, అల్లం ముక్క - కొద్దిగా, కొత్తిమీర - ఒకకట్ట, పసుపు - చిటికెడు, యాలకుల పొడి - చిటికెడు, గరంమసాలా- పావు టీస్పూన్‌, మామిడికాయ పొడి - పావు టీస్పూన్‌, బ్రెడ్‌ క్రంబ్స్‌ - కొద్దిగా, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.


తయారీ: ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి, కట్‌ చేసి రెండు, మూడు నిమిషాల పాటు వేడి నీళ్లలో ఉడికించాలి. బంగాళదుంపలను ఉడికించి, పొట్టు తీసి గుజ్జుగా చేసుకోవాలి. పచ్చి బఠాణీని ఉడికించుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక పచ్చిబఠాణీ, పాలకూర వేసి వేగించాలి. కొద్దిగా ఉప్పు వేయాలి. పసుపు, కొత్తిమీర వేసి కలపాలి. మూడు, నాలుగు నిమిషాల పాటు వేగించాలి. చల్లారిన తరువాత మిక్సీలో వేయాలి. పచ్చిమిర్చి, అల్లం వేసి గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. అందులో బంగాళదుంప గుజ్జు, యాలకుల పొడి, గరంమసాలా, మామడికాయ పొడి, బ్రెడ్‌క్రంబ్స్‌, తగినంత ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి. చేతికి నూనె రాసుకుంటూ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ గారెల్లా ఒత్తుకోవాలి. స్టవ్‌పై నాన్‌స్టిక్‌ పాన్‌ పెట్టి కొద్దికొద్దిగా నూనె వేస్తూ పాలకూర కబాబ్స్‌ను కాల్చాలి. కబాబ్స్‌ను రెండు వైపులా గోధుమరంగులోకి మారే వరకు  కాల్చాలి. చట్నీతో సర్వ్‌ చేసుకుంటే ఇవి రుచిగా ఉంటాయి.


Updated Date - 2020-08-08T19:06:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising