టార్ట్ ఛాట్
ABN, First Publish Date - 2020-06-13T16:41:46+05:30
ఆపిల్ - ఒకటి, కీర - ఒకటి, టొమాటో - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, మొలకెత్తిన గింజలు - పావుకప్పు, దానిమ్మ గింజలు - పావుకప్పు,
కావలసినవి: ఆపిల్ - ఒకటి, కీర - ఒకటి, టొమాటో - ఒకటి, ఉల్లిపాయ - ఒకటి, మొలకెత్తిన గింజలు - పావుకప్పు, దానిమ్మ గింజలు - పావుకప్పు, కారప్పూస - కొద్దిగా, చింతపండు చట్నీ - నాలుగు టీస్పూన్‌లు, నల్లమిరియాలు - కొద్దిగా, ఉప్పు - రుచికి తగినంత, పెరుగు - నాలుగు టీస్పూన్లు, టార్ట్‌లు - పది.
తయారీ: యాపిల్, కీర, టొమాటో, ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. మొలకెత్తిన గింజలు వేయాలి. తరువాత పెరుగు, చట్నీ, మిరియాలు, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులో టార్ట్‌లు పెట్టుకోవాలి. అందులో చాట్ మిక్చర్ వేయాలి. కారప్పూస, దానిమ్మ గింజలతో గార్నిష్ చేసి అందించాలి.
Updated Date - 2020-06-13T16:41:46+05:30 IST