ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెజ్‌ పిజ్జా

ABN, First Publish Date - 2020-05-20T21:19:51+05:30

మైదా - కప్పు, గోధుమపిండి - కప్పు, యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ - టేబుల్‌ స్పూను, నీళ్లు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలసినవి: మైదా - కప్పు, గోధుమపిండి - కప్పు, యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ - టేబుల్‌ స్పూను, నీళ్లు - అరకప్పు, నూనె - 1 1/2 స్పూన్లు, ఉప్పు - తగినంత, పంచదార - ముప్పావు స్పూను, టొమాటోలు - 400 గ్రా., వెల్లుల్లి రెబ్బలు - 2, ఎండుమిరప కాయ - 1, మిరియాల పొడి - అర స్పూను, వెన్న - 200 గ్రా., క్యాప్సికం, ఉల్లి, బాదం, టొమాటో, పుట్టగొడుగుల ముక్కలు - కప్పున్నర, పిజ్జా సాస్‌ - తగినంత


తయారీ: ముందుగా ఒక పాత్రను పొయ్యి మీద వేడి చేసి కిందకు దింపండి. అందులో గోరువెచ్చని నీటిని పోసి యాక్టివ్‌ డ్రై ఈస్ట్‌ను, తరువాత పంచదార వేసి నెమ్మదిగా కలియతిప్పండి. పది నిమిషాల పాటు కదలకుండా ఉంచండి. ఈస్ట్‌ నుంచి నురుగు వచ్చాక గోధుమ పిండి, మైదాపిండి కలపండి. తరువాత నూనె, ఉప్పు వేయండి. తగినన్ని నీళ్లు కలుపుతూ ఐదారు నిమిషాలపాటు బాగా పిసుకుతూ పిండిని ముద్దలా కలపండి. పిండి మృదువుగా, సాగుతూ ఉండాలి. పిండిని గుండ్రటి బాల్‌లా చేసి, తేమ ఆరకుండా పైన  నూనె రాయాలి. దాన్ని ఓవెన్‌లో పెట్టి 240 డిగ్రీల  సెల్సియస్‌ వద్ద 25 నిమిషాల పాటు ఉంచాలి. పిండిని బయటకు తీసి, పలుచగా ఒత్తుకోవాలి. పైన పిజ్ఞా సాస్‌ వేసి దానిపైన కూరగాయ ముక్కలను వేసుకోవాలి. 10 నిమిషాలపాటు కడాయిపై వేగించాలి. చీజ్‌ బంగారం రంగులోకి మారితే పిజ్జా తయారైనట్టే. కావలసిన ఆకారంలోకి కత్తిరించుకొని పిజ్జాను వేడివేడిగా ప్లేట్‌లో వడ్డించుకోవాలి.

Updated Date - 2020-05-20T21:19:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising