ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కసు ఖరీదు 13.5 కోటు!

ABN, First Publish Date - 2021-12-07T07:42:06+05:30

గుడి, బడి.. కరెంటు స్తంభం.. పంచాయతీ ఆఫీసు.. ప్రభుత్వ భవనాలు.. చెట్టు, పుట్టా.. ఏది కనపడినా వదలకుండా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పల్లె వెలుగు బస్సుల రంగుల మార్పు

 నష్టాల్లో ఉన్న ఆర్టీసీపై మరో భారం

అమరావతి, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): గుడి, బడి.. కరెంటు స్తంభం.. పంచాయతీ ఆఫీసు.. ప్రభుత్వ భవనాలు.. చెట్టు, పుట్టా.. ఏది కనపడినా వదలకుండా వైసీపీ జెండా రంగులు వేయించిన జగన్‌ ప్రభుత్వం.. కోర్టు మొట్టికాయలు వేసినా లెక్కచేయడం లేదు. తాజాగా ఏపీఎ్‌సఆర్టీసీకి చెందిన పల్లెవెలుగు బస్సుల రంగులు మార్చుతోంది. టీడీపీ హయాంలో తెలుగువెలుగు పేరిట నడిపిన ఈ బస్సులకు.. జగన్‌ సర్కారు రాగానే మళ్లీ పల్లెవెలుగు బస్సులుగా పేరుపెట్టారు. ఇప్పుడు వాటికి వేసిన రంగులను కూడా అక్కసుతో తొలగిస్తూ.. కొత్త రంగులు వేస్తున్నారు. ఇందుకు గాను ఆ సంస్థపై అక్షరాలా రూ.13.5 కోట్ల భారం పడుతోంది. అసలే నష్టాల బాటలో కునారిల్లుతున్న ఆర్టీసీకి ఇదొక ఆర్థిక భారం. పల్లెవెలుగు బస్సులంటే నిజానికి తెల్ల ఏనుగులతో సమానం. వీటిపై వచ్చే ఆదాయం తక్కువ.. చేసే ఖర్చు ఎక్కువ. పైగా వీటిలో 70 శాతానికి పైగా బస్సులకు ఆయుష్షు తీరిపోయింది. సేవల నుంచి తీసివేయాల్సిన ఈ బస్సులకు.. అవసరం లేకున్నా ఇప్పుడు సోకులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో వాటిపై ఆకుపచ్చ, పసుపు పచ్చ, తెల్ల రంగులుండేవి. ఇప్పుడు కాస్త డిజైన్‌ మార్చి.. ఆకుపచ్చ, తెల్ల రంగులతో పాటు సిమెంటు రంగు కూడా వేస్తున్నారు. రోజూ 40 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్న ఆర్టీసీలో 11వేల బస్సులుండగా వాటిలో పల్లెవెలుగు సర్వీసులు 4,500. ఇప్పుడు ఒక్కో బస్సుకు రూ.25-30 వేల ఖర్చుతో రంగులు మార్చుతోంది. అంటే రూ.11.25 కోట్లనుంచి రూ.13.50 కోట్ల భారం పడుతోందన్న మాట. 


పాతబడినందుకేనట!

అయితే బస్సులు పాతబడినందుకే కొత్త రంగులు వేస్తున్నామని.. ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఒక ఉన్నతాధికారి ఈ విషయమై మాట్లాడుతూ.. ‘ప్రయాణికుడు ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తైనా ఆర్టీసీ బస్సులో సురక్షితంగా గమ్యానికి చేరుస్తాం.. పల్లె వెలుగుకు పార్టీలతో సంబంధం ఉండదు’ అని సరదాగా వ్యాఖ్యానించారు. ఆర్టీసీ సిబ్బంది మాత్రం ఈ నిర్ణయంపై పెదవివిరుస్తున్నారు. కాలం తీరిన బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయకుండా మేకప్‌ (రంగు) వేస్తే జనం ఎక్కుతారా అని ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2021-12-07T07:42:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising