ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు రాజధానుల సభలో అమరావతి మాట

ABN, First Publish Date - 2021-12-19T08:38:38+05:30

మూడు రాజధానుల సభలో అమరావతి మాట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతిపైనే సీమ జనాల్లోనూ అభిమానం

‘రాయలసీమ మనోగతం’ పేరిట తిరుపతిలో సభ

సభ ఎందుకో తెలియదన్న మహిళలు

డ్వాక్రా మీటింగ్‌ అని కొందరికి సమాచారం

రాకపోతే జరిమానా వేస్తామని బెదిరింపులు

వచ్చిన వాళ్లు వెళ్లిపోకుండా గేట్లకు తాళాలు

గేట్లు తెరవాలని వాగ్వాదం..తోపులాట

గేట్లు, గోడలు ఎక్కి బయటకు వెళ్లిన జనం

కవర్‌ చేస్తున్న మీడియాపై దౌర్జన్యం

గంటలోపే ముగిసిన వికేంద్రీకరణ సభ


రాజధాని ఎక్కడుండాలని భావిస్తున్నారు? 

అమరావతి ఉంది కదా!

విశాఖలో రాజధాని ఏర్పాటుచేస్తే సౌకర్యంగా ఉంటుందా? 

అమరావతే దగ్గర కదా!

రాజధాని ఎక్కడ ఉంటే బాగుంటుంది?

అమరావతిలోనే ఉండాలి. రేపు కోస్తా, రాయలసీమ విడిపోతే రాజధాని ప్రాంతాలు చెరిసగం దక్కుతాయి. ఆ ఉద్దేశంతోనే అమరావతిని నాడు నిర్ణయించారు. ఇప్పుడు మూడు అంటే అదేమవుతుందో తెలియదు. 

దేనిని రాజధాని చేస్తే మీకు దగ్గరగా ఉంటుంది?

అమరావతే! అన్నింటికీ అదే జంక్షన్‌ కదా!

మూడు రాజధానుల సభకు వచ్చిన 

మహిళలను అడిగిన ప్రశ్నలకు వారిచ్చిన సమాధానాలు..


తిరుపతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల సభలోనూ అమరావతి మాట వినిపించింది. ‘అభివృద్ధి వికేంద్రీకరణ- రాయలసీమ మనోగతం’ పేరిట తిరుపతిలోని తుడా మైదానంలో పలు సంఘాలు శనివారం సభ నిర్వహించాయి. రాయలసీమ మనోగతం తెలుసుకునేందుకు జరిపిన సభ ఇది. కానీ, ఎందుకు ఈ సభను నిర్వాహకులు ఏర్పాటుచేశారో తమకు తెలియదని పలువురు మహిళలు చెప్పడం గమనార్హం. అంతేకాదు.. రాజధానిగా అమరావతే ఉండాలని వారంతా తేల్చిచెప్పారు. ఎండ తీవ్రంగా ఉండటం.. తల దాచుకోవడానికి మైదానంలో షామియానాలు వేయకపోవడంతో.. వచ్చినవారిలో ఎక్కువమంది మధ్యలోనే వెనుదిరిగారు. వాళ్లను నిలువరించడానికి నిర్వాహకులు, పోలీసులు చేసిన ప్రయత్నాలు వికటించి.. సభ రసాభాసగా మారింది. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ 10.45 గంటలకు మొదలైంది. ఈ సభకు తిరుపతి నగరంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను, ఎంపిక చేసిన ప్రైవేటు విద్యాసంస్థల నుంచి విద్యార్థులను రప్పించారు. మెప్మా అధికారులు గ్రూపులీడర్లను బెదిరించి మరీ తుడా మైదానానికి తరలించారు. ఇప్పుడేం సభ అని ప్రశ్నించిన మహిళలను అధికారులు గట్టిగా హెచ్చరించారు. సభకు రాకపోతే వెయ్యి రూపాయలు జరిమానా వేస్తామని, ఇకపై రుణాలు ఇచ్చేది ఉండదంటూ బెదిరించారు. ఇవన్నీ తమను కలిసిన మీడియాకు స్వయంగా ఆ మహిళలే చెప్పారు. ఈ సభ ఎందుకోసమని ప్రశ్నిస్తే... తమకు తెలయదని కొందరు, డ్వాక్రా మీటింగు అంటే వచ్చామని మరికొందరు చెప్పారు. లోపలకు వచ్చి వేదికపై బ్యానర్‌ చూసేవరకు సభ ఎందుకు జరుగుతున్నదో తెలియదని ఓ మహిళ అంటే.. మీటింగు అంటే వచ్చామని, సబ్జెక్టు ఏమిటో తెలియదని ఓ విద్యార్థిని చెప్పారు. ఇలా బలవంతంగా వచ్చిన మహిళలు.. సభ జరుగుతుండగానే తుడా మైదానాన్ని వదిలి వెళ్లిపోవడం కనిపించింది. అయితే, మైదానానికి ఉన్న రెండు గేట్లకూ తాళాలు వేసి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొందరు గేట్లు ఎక్కి, మరికొందరు గోడ ఎక్కి వెళ్లిపోగా మిగిలినవారంతా మూకుమ్మడిగా గేట్ల వద్దకు వచ్చి పోలీసులతో గొడవకు దిగారు. ఈ సందర్భంగా తోపులాట జరిగింది. వచ్చిన మహిళల్లో వృద్ధులు కూడా ఉండడంతో వారు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ దృశ్యాలను కవర్‌ చేస్తున్న మీడియా ప్రతినిధులపై వైసీపీ కార్యకర్తలు దౌర్జన్యానికి దిగారు. కొందరి వద్ద కెమెరాలు, మొబైల్‌ ఫోన్లు లాక్కున్నారు. ఒకరిద్దరిపై దాడి కూడా చేశారు. కెమెరాలు, మొబైల్‌ ఫోన్లలో రికార్డు చేసిన వీడియోలను, తీసిన ఫొటోలను తొలగించి మరీ వెనక్కి ఇచ్చారు. ఈ ఘటనతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో గంటలోపే సభ ముగిసింది. 



Updated Date - 2021-12-19T08:38:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising