ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరీ.. ఇంత అన్యాయమా?

ABN, First Publish Date - 2021-01-20T07:03:32+05:30

వారు రోడ్డు కోసం ఇళ్లు కోల్పోయారు..

రాప్తాడులో నిర్మించిన సీసీ రోడ్డు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పేదలపై రాజకీయం

రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన టీడీపీ మద్దతుదారులు

ఇంటి పట్టాల పంపిణీలో రిక్తహస్తం

వైసీపీ మద్దతుదారులకే పంపిణీ


రాప్తాడు(అనంతపురం): వారు రోడ్డు కోసం ఇళ్లు కోల్పోయారు. పలువురు దుకాణాలను వదులుకుని, జీవనాధారం కోల్పోయారు. వారికి టీడీపీ హయాంలో మరోచోట ఇళ్ల పట్టాలిచ్చి, న్యాయం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక, వారు నిర్వాసితులని కూడా చూడకుండా వారి ఇళ్ల పట్టాలను రద్దు  చేశారు. తాజా పట్టాల పంపిణీలో టీడీపీ మద్దతు దారులంటూ పేదలపై ముద్ర వేసి, మొండిచేయి చూపారు. దీంతో రోడ్డుకు ఇళ్లు, దుకాణాలు కోల్పోయిన పేదలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. వైసీపీ మద్దతుదారులకే మాత్రమే పట్టాలిచ్చి, తమకివ్వకపోటం అన్యాయమంటూ వాపోతున్నారు. రాప్తాడులో రోడ్డు విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన వారిలో కొందరికి మాత్రమే తాజాగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. దాదాపు 40 మందికి ఇవ్వలేదు. అధికార పార్టీ స్థానిక నాయకులు వారందరినీ టీడీపీ మద్దతుదారులుగా భావించి, పట్టాలివ్వొద్దని హుకుం జారీ చేశారు. దీంతో అధికారులు వారికి పట్టాలు పంపిణీ చేయలేదన్న అభిప్రాయం బాధిత వ ర్గాల నుంచి వినిపిస్తోంది. వైసీపీ మద్దతుదారులు, నా యకుల అనుచరవర్గాలకు మాత్రమే పట్టాలు పంపిణీ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


హామీ ఇచ్చిందిలా..

రోడ్డు విస్తరణలో భాగంగా టీడీపీ హయాంలో రాప్తాడులో 70 ఇళ్లను తొలగించారు. కొందరు పూర్తిస్థాయిలో ఇల్లు కోల్పోగా.. మరికొందరు సగానికిపైగా పోగొట్టుకున్నారు. ఇంకొందరు ఉపాధినిచ్చే దుకాణాలను వదులుకోవాల్సి వచ్చింది. సగం ఇల్లు కోల్పోయినవారు మరమ్మతులు చేసుకుని, అందులోనే జీవిస్తున్నారు. పూర్తిగా కోల్పోయిన వారిలో వైసీపీ, టీడీపీ మద్దతుదారులతోపాటు తటస్థులూ ఉన్నారు. అప్పట్లో నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పరిటాల సునీత మంత్రి హోదాలో పార్టీలకతీతంగా బాధితులకు పండమేటి వెంకటరమణస్వామి ఆలయ సమీపాన సర్వే నెంబరు 245లో ఒక్కొక్కరికి ఒకటిన్నర సెంటు చొప్పున పట్టాలు పంపిణీ చేశారు. అంతేకాదు, దాదాపు రూ.కోటి ఖర్చుతో 60 అడుగుల రోడ్డు విస్తరణలో భాగంగా సీసీ రోడ్లు, డివైడర్లు ఏర్పాటు చేశారు.


టీడీపీ మద్దతుదారులకు మొండిచేయి

రాష్ట్రంలో అధికార మార్పుతో అప్పట్లో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇచ్చిన పట్టాలను వైసీపీ స్థానిక నేతల ఆదేశాలతో రద్దు చేశారు. టీడీపీ హయాంలో ఇచ్చిన పట్టాలను రద్దు చేసి, తాజా పంపిణీలో చేర్చారు. ఇక్కడే అధికార పార్టీ నేతలు రాజకీయ కక్షకు తెరలేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇళ్లు కోల్పోయిన 71 మందిలో 30 మంది వైసీపీ మద్దతుదారులు, వారికి అనుకూలమైన వారికి మాత్రమే పట్టాలిచ్చారు. మిగిలిన 41 మందికి మొండిచేయి చూపారు. టీడీపీ మద్దతుదారులనే పట్టాలివ్వలేదన్న విమర్శలున్నాయి. బాధిత వర్గాల నుంచి అదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకెందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వరని బాధితులు ప్రశ్నిస్తే.. ఇళ్లున్నాయంటూ వైసీపీ నేతలు, అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పట్టాలిచ్చా రు కదా, అని అడిగితే.. అవి చెల్లవని రెవెన్యూ అధికారులు చెబుతున్నారంటే.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ఏ మేరకు ఉన్నాయో తేటతెల్లమవుతోంది.


టీడీపీ వాళ్లమనే ఇంటి స్థలాలివ్వలేదు: కొండప్ప

రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారందరికీ అప్పటి మంత్రి పరిటాల సునీత పట్టాలు పంపిణీ చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో వాటిని రద్దు చేసి, కొత్తపట్టాలు త యారు చేశారు. వైసీపీ మద్దతుదారులకు మాత్రమే పంపిణీ చేసి, టీడీపీ మద్దతుదారులమని మాకు ఇవ్వలేదు.


భూమి అమ్మి, ఇల్లు కట్టుకున్నా: సాకే మారిష్‌

రోడ్డు విస్తరణకు మా సగం ఇల్లు కూల్చేశారు. భూమి అమ్మి వచ్చిన డబ్బుతో మిగతా ఇంటిని నిర్మించుకున్నా. ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా, ఇవ్వలేదు. అధికారులు స్పందించి, రోడ్డు విస్తరణలో పాక్షికంగా ఇళ్లు కోల్పోయిన వారికీ స్థలాలు పంపిణీ చేయాలి.


ఇళ్ల స్థలాలివ్వాలి: నారాయణమ్మ, బాధితురాలు

రోడ్డు విస్తరణలో సగం ఇల్లు కోల్పోవటంతో మి గతా భాగానికి మరమ్మతులు చేసుకున్నాం. గ తంలో ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలనుకున్నాం. ఆ పట్టాలు రద్దు చేశారు. ఇటీవల పం పిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో మాకివ్వలేదు. అధికారులు విచారించి, ఇళ్లు కోల్పోయిన వారికి స్థలాలు పంపిణీ చేయాలి.


ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తాం

టీడీపీ హయాంలో పంపిణీ చేసిన పట్టాలను ప్రస్తుతం రద్దు చేశారు. రెవెన్యూ అధికారులను అడిగితే ఈ పట్టాలు గత ప్రభుత్వంలో పంపిణీ చేశారనీ, ఇప్పుడు చెల్లవని చెబుతున్నారు. స్థలాలు రాని వారందరం కలిసి సమస్యను ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డికి తెలియజేస్తాం. -  లక్ష్మీదేవి, బాధితురాలు

Updated Date - 2021-01-20T07:03:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising