ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బేరం కుదరకే కూల్చేశారా.?

ABN, First Publish Date - 2021-08-27T06:00:00+05:30

పట్టణంలోని 32 వ వార్డులో నిర్మాణంలో ఓ భవనాన్ని మున్సిపాల్టీ టౌనప్లానింగ్‌ అధికారులు రెండు రోజుల కిందట నామమాత్రంగా తొలగించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- భవన యజమానితో ఓ ప్రజాప్రతినిధి బేరసారాలు..

- సోషల్‌ మీడియాలో హల్‌చల్‌..

- నామమాత్రంగా తొలగింపులపై విమర్శలు

కదిరి, ఆగస్టు 26: పట్టణంలోని 32 వ వార్డులో నిర్మాణంలో ఓ భవనాన్ని మున్సిపాల్టీ టౌనప్లానింగ్‌ అధికారులు రెండు రోజుల కిందట నామమాత్రంగా తొలగించారు. దీనిపై సోషల్‌ మీడియా లో పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. వివరాలలోకి వెళ్ళితే 32వ వార్డులో షిర్డిసాయిబాబా ఆలయానికి సమీపంలో  ఒకే వ్యక్తి 7 ప్లాట్లలో భవన నిర్మాణాలు సాగిస్తున్నాడు. బేస్‌మెంట్‌ నుంచి లెం టెల్‌ లెవల్‌ వరకు నిర్మాణం పూర్తి అయ్యింది. అయితే ఈ నిర్మాణా నికి అనుమతులు లేవంటూ గతంలోనే అధికారులు ఆపేశారు. ప్రస్తుత టౌనప్లానింగ్‌ అధికారి రహిమాన ఇచ్చిన బిల్డింగ్‌ అనుమ తులపై సంవత్సరం కిందట ఏసీబీ తనిఖీలు నిర్వహించారు. ఆ తనిఖీల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న భవనానికి అనుమతులు లేకుండా ఎందుకు నిర్మాణం కొనసాగించారని రిమార్కులలో లేవనె త్తారు. తిరిగి ఇటీవలే ఆ భవనాన్ని కూల్చి వేయాలని ఉన్నతాధికా రుల నుంచి ఆదేశాలు అందాయి. ప్రస్తుతం భవన నిర్మాణం చేప ట్టాలంటే మున్సిపాల్టీకి నిర్మాణం జరుగుతున్న విస్తీర్ణంలో 10 శాతం రాసి ఇవ్వాలి  ఆమేరకు అక్కడ నాలుగు సెంట్లు స్థలాన్ని మున్సి పాల్టీ పేర రిజిస్టర్‌ చేయాల్సి ఉంది. ఆ భవన యజమాని ఇందుకు ససే మిరా అనడంతో నిర్మాణం ఆగిపోయింది. టౌనప్లానింగ్‌ అధికా రికి, భవన యజమానికి  ఓ ప్రజా ప్రతినిధి మఽధ్యవర్తిగా వ్యవహ రించి రూ.10 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  బే రం కుదరకే ఆ ప్రజా ప్రతినిధి, మున్సిపల్‌ అధికారులు ఆ భవనా న్ని నామమాత్రంగా తొలగించి, బెదిరించినట్లు సమాచారం. వాస్త వానికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ భవన నిర్మాణాన్ని పూర్తిగా తొలగించాల్సి ఉంది. అధికారులు మాత్రం  వరండాను కొద్దిపాటిగా పెకలించి వదిలివేశారు. దీనిపై పట్టణంలో రెండు రోజులుగా చర్చ కొనసాగుతూనే ఉంది. మున్సిపల్‌ అధికా రులు, ఆ ప్రజా ప్రతినిధి కలసి పెద్ద ఎత్తున డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని వైసీపీకి చెందిన ఓ ప్రజా ప్రతినిధి సోషల్‌ మీడియాలో బట్టబయలు చేసినట్లు తెలిసింది. 

 మున్సిపల్‌ కమిషనర్‌ వివరణ : దీనిపై మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమీలను ఆంధ్రజ్యోతి వివరణ కోరగా భవనం తొలగించాలని ఉన్నతాధికారుల ఆదేశాలొచ్చాయన్నారు. దీంతో ఆ భవనాన్ని తొల గించాలని టౌనప్లానింగ్‌ అధికారికి ఆదేశించానన్నారు. ఎంత వరకు పని జరిగిందో పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. 

Updated Date - 2021-08-27T06:00:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising