ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళలను కించపరిస్తే పుట్టగతులుండవ్‌..

ABN, First Publish Date - 2021-11-23T05:58:29+05:30

మహిళలను కించపరిస్తే పుట్టగతులుండవని తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు మండిపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

మంత్రుల దిష్టిబొమ్మల దహనం

 ధర్మవరం, నవంబరు 22: మహిళలను కించపరిస్తే పుట్టగతులుండవని తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు టుంబసభ్యులపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుయువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఆందోళన చేప ట్టారు. సోమవారం సాయంత్రం గాంధీసర్కిల్‌ నుండి ఎన్టీఆర్‌ సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం మంత్రులు కొడాలి నాని, అంబటి రాంబాబు, ఎమ్మె ల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.... శాసనసభలో ప్రజాసమస్యలపై చర్చించకుండా విషయా లను పక్కదారి పట్టించేందుకు వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సీఎం జగన్‌కు  ప్రతి పక్షనాయకులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఇలా కొత్తఒరవడికి శ్రీకారం చుట్టారని మండిపడ్డారు. ఈ కార్యక్ర మంలో తెలుగుయువత రాష్ట్రప్రధాన కార్యదర్శి గడుపూటి నారాయణస్వామి, రాష్ట్రనా యకు లు గడుపూటి విజయ్‌ చౌదరి, పార్లమెంట్‌ అధఽ్యక్షుడు బాబ్జాన్‌, ప్రధానకార్యదర్శి శ్రీనివాసులు, టీఎన్‌ఎస్‌ ఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు జగదీశ్‌, మాజీ జడ్పీటీసీ మేకల రామాంజినేయులు, తెలుగుమహిళారాష్ట్ర కార్యదర్శి సాహెబ్బీ, రాప్తాడు తెలుగుయువత అధ్యక్షుడు మద్దినేనికృష్ణ, తెలుగుయువత నాయకులు కృష్ణగో పాల్‌, చల్లానాయుడు, మద్దుకూరి వెంకట్‌, బొమ్మినేని శివ, చీర్లనరేశ్‌, మాల్యవం తం శీన, సంఘాల బాలు, అశోక్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఇర్షాద్‌, టీడీపీ నాయకులు, ఎమ్మార్పీఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-11-23T05:58:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising