ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ధర్నాను విజయవంతం చేయండి : బీకే

ABN, First Publish Date - 2021-08-27T05:48:19+05:30

రాష్ట్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా ఈనెల 28న టీడీపీ చేపట్టబోయే ధర్నాను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పిలుపునిచ్చారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న మాజీ ఎమ్మెల్యే పార్థసారథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోరంట్ల, ఆగస్టు 26: రాష్ట్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెంపునకు నిరసనగా ఈనెల 28న టీడీపీ చేపట్టబోయే ధర్నాను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే పార్థసారథి పిలుపునిచ్చారు. గోరంట్ల మండలంలోని పలు కార్యక్రమాల్లో గురువారం పాల్గొన్న ఆయన ఎం.కొత్తపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం గ్యాస్‌, పెట్రోల్‌, డీజల్‌ ధరలు పెంచినందుకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టినట్లు వివరించారు. వాసవీమహాల్‌ నుండి తహసీల్దార్‌ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సీబీఎన ఆర్మీ, తదితరులు శనివారం ఉదయం పది గంటలకు వాసవీఆలయం వద్దకు చేరుకోవాలన్నారు. గోరంట్ల మండలంలో గతంలో ఈఏపీ నిధులతో మంజూరైన బూచేపల్లి, చెట్లమొరంపల్లి, వెంకటరమణపల్లి, రోడ్డు పనులు నిలిచిపోయాయన్నారు. అయితే రూ.53కోట్ల నిదులు విడుదలైనా మంత్రి అసమర్థతవల్ల ఏళ్లు గడుస్తున్నా రహదారి పనులు పూర్తీకాలేదని పార్థసారథి విమర్శించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కన్వీనర్‌ సోమశేఖర్‌, నరసింహప్ప, చింతా భాస్కర్‌రెడ్డి, రఘునాథ్‌రెడ్డి, వెంకటరంగారెడ్డి, నరసింహమూర్తి, నూర్‌మహ్మద్‌, నీలకంఠరెడ్డి, శ్రీనివాసగౌడ్‌, హరిప్రసాద్‌, నరేంద్ర, శేఖర్‌, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-27T05:48:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising