ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీ కండక్టర్‌ నిజాయితీ

ABN, First Publish Date - 2021-01-13T06:53:27+05:30

బస్సు లో ప్రయాణికురాలు మరచిపోయిన బంగారు గొలుసు ఉన్న బ్యాగును ఆమెకు తిరిగి అప్పగించి, ఆర్టీసీ బస్సు కండక్టర్‌ ఎంఎన్‌ రెడ్డి నిజాయితీ చాటుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోగొట్టుకున్న బంగారు 

గొలుసును తిరిగిచ్చిన వైనం

ధర్మవరంఅర్బన్‌, జనవరి 12: బస్సు లో ప్రయాణికురాలు మరచిపోయిన బంగారు గొలుసు ఉన్న బ్యాగును ఆమెకు తిరిగి అప్పగించి, ఆర్టీసీ బస్సు కండక్టర్‌ ఎంఎన్‌ రెడ్డి  నిజాయితీ చాటుకున్నారు. ధర్మవరం డిపోకి చెందిన పల్లెవెలుగు బస్సు సోమవారం గోరంట్ల నుంచి ధర్మవరానికి బయలుదేరింది. పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన రంజిత్‌కుమార్‌, అతడి తల్లి లక్ష్మీప్రసన్న అందులో ఎక్కారు. స్వగ్రామమైన పెడబల్లి స్టాప్‌లో దిగారు. వారు 3 తులాల బంగారు గొలుసు ఉంచిన బ్యాగును బస్సులోనే మరచిపోయారు. రాత్రి ఇంట్లో బ్యాగు కనిపిం చకపోవటంతో బస్సులోనే ఉన్నట్లు భావించారు. రాత్రి బస్సులో ఉన్న ఆ బ్యాగును కండక్టర్‌ ఎంఎన్‌ రెడ్డి ఎస్‌టీఐ రామాంజనేయులుకు అందజేయగా, ఆయన డీఎం మల్లికార్జునకు ఇచ్చారు. ఈ నేపథ్యంలో బ్యాగును పొగొట్టుకున్న రంజిత్‌కుమార్‌ మంగళవారం పెడబల్లి బస్టా్‌పలో వేచిఉండగా, గోరంట్ల నుంచి ఆ బస్సు వచ్చింది. అందులో అదే కండక్టర్‌ ఉండటంతో తాను సోమవారం బస్సులో బ్యాగు మరచిపోయినట్లు తెలిపాడు. కండక్టర్‌ సూచన మేరకు రంజిత్‌కుమార్‌ అదే బస్సులో ధర్మవరం డిపో చేరుకుని, డీఎంను కలిశాడు. దీంతో ఆ బ్యాగును  డీఎం మల్లికార్జున, ఎస్టీఐ రామాంజనేయులు, సిబ్బంది.. రంజి త్‌కుమార్‌కు అందజేశారు. కండక్టర్‌ను అందరూ అభినందించారు.




Updated Date - 2021-01-13T06:53:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising