ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్రచందనం దుంగల పట్టివేత

ABN, First Publish Date - 2021-12-25T05:49:26+05:30

అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం రాత్రి చిలమత్తూరు పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా నుంచి బెంగళూరుకు లారీలో (యూపీ-63.టీ-3300) తరలిస్తుండగా జాతీయ రహదారి 44 కొడికొండ చెక్‌పోస్టు వద్ద హిందూపురం రూరల్‌ సీఐ హమీద్‌ఖాన, ఎస్‌.ఐ రంగడు యాదవ్‌ వాటిని స్వాధీనం చేసుకున్నారు.

కొడికొండ చెక్‌పోస్టులో ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కడప నుంచి బెంగళూరుకు తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్‌

చిలమత్తూరు, డిసెంబరు 24: అక్రమంగా రవాణా చేస్తున్న ఎర్రచందనం దుంగలను శుక్రవారం రాత్రి చిలమత్తూరు పోలీసులు పట్టుకున్నారు. కడప జిల్లా నుంచి బెంగళూరుకు లారీలో (యూపీ-63.టీ-3300) తరలిస్తుండగా జాతీయ రహదారి 44 కొడికొండ చెక్‌పోస్టు వద్ద హిందూపురం రూరల్‌ సీఐ హమీద్‌ఖాన, ఎస్‌.ఐ రంగడు యాదవ్‌ వాటిని స్వాధీనం చేసుకున్నారు. లారీ ముందు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంలో వెళుతుండగా వారిని పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో వారు ద్విచక్ర వాహనాన్ని అక్కడే పడేసి పారిపోయారు.  వెనుక వస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా.. అందులో 38 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించారు. లారీతో పాటు ఎర్రచందనం రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా.. మరో వ్యక్తి తప్పించుకున్నాడు. ఎర్రచందనం దుంగలతో పాటు లారీని, ద్విచక్రవాహనాన్ని చిలమత్తూరు స్టేషన తరలించినట్లు ఎస్‌ఐ రంగడు తెలిపారు. అయితే ఈ దుంగలను ఎవరు రవాణా చేస్తున్నారు? ఎక్కడికి తీసుకెళుతున్నారు? వాటి విలువ ఎంత? అనే విషయాలను పోలీసులు వెల్లడించడానికి నిరాకరించారు. కాగా, ఈ దుంగల విలువ రూ. 15 లక్షలు ఉండవచ్చని భావిస్తున్నారు. నెల క్రితం పలువురు ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్న విషయం తెల్సిందే. 


Updated Date - 2021-12-25T05:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising