టీకాల్లో పదో స్థానంలో ఏపీ
ABN, First Publish Date - 2021-05-13T08:03:43+05:30
దేశవ్యాప్తంగా ఇప్పటికి 17.52 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. రాష్ట్రాల వారీగా చూస్తే... కరోనా వ్యాక్సినేషన్‌లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో నిలిచింది
ఇప్పటికి 73.40 లక్షల డోసుల వినియోగం
1.86 కోట్లతో అగ్రస్థానంలో మహారాష్ట్ర
మనకంటే ఒక అడుగు ముందున్న కేరళ
దేశవ్యాప్తంగా 17.52 కోట్ల డోసుల వ్యాక్సినేషన్
18-44 ఏళ్ల లబ్ధిదారులు 30.44లక్షల మంది
ఈ కేటగిరీలో ఏపీలో 812 మంది మాత్రమే
న్యూఢిల్లీ, మే 12 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఇప్పటికి 17.52 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. రాష్ట్రాల వారీగా చూస్తే... కరోనా వ్యాక్సినేషన్‌లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో నిలిచింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. బుధవారం ఉదయం 7 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 25,47,534 వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా 17,52,35,991 డోసులు వేసినట్లు తెలిపింది. వ్యాక్సినేషన్‌లో టాప్-10లో ఉన్న రాష్ట్రాల వివరాలను మాత్రమే అధికారికంగా ప్రకటించారు. ఇందులో తెలంగాణ లేదు.
వ్యాక్సినేషన్‌లో టాప్ టెన్ ఇవే (డోసులు)
1. మహారాష్ట్ర - 1,86,46,558 (10.64 శాతం)
2. రాజస్థాన్ - 1,45,24,097 (8.29శాతం)
3. గుజరాత్ - 1,44,35,678 (8.24 శాతం)
4. ఉత్తర ప్రదేశ్ - 1,39,36,210 (7.95శాతం)
5. పశ్చిమ బెంగాల్ - 1,21,46,487 (6.93శాతం)
6. కర్ణాటక - 1,07,91,698 (6.16శాతం)
7. మధ్యప్రదేశ్ - 87,32,038 (4.98శాతం)
8. బిహార్ - 81,12,866 (4.65శాతం)
9. కేరళ - 81,12,866 (4.63శాతం)
10. ఆంధ్రప్రదేశ్ - 73,40,481 (4.19 శాతం)
18-44 ఏళ్ల వయసు మధ్య...
18-44ఏళ్ల లోపు ఉండే వారిలో దేశవ్యాప్తంగా 30.44 లక్షల మందికి తొలి డోసు వ్యాక్సిన్ ఇచ్చారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌లో కేవలం 812మంది మంది మాత్రమే ఉన్నారు. తెలంగాణలో వీరి సంఖ్య 500 మాత్రమే. ఇదే కేటగిరీలో మహారాష్ట్రలో 5.96 లక్షల మంది, రాజస్థాన్‌లో 4.91 లక్షలు, ఢిల్లీలో 4.21 లక్షలు, గుజరాత్‌లో 3.56 లక్షల మంది తొలి డోసు తీసుకోవడం గమనార్హం.
ఎవరికి ఎన్ని?
- ఆరోగ్య సిబ్బంది 95,82,449మంది మొదటి డోసు... 65,39,376మంది రెండో డోసు తీసుకున్నారు.
- ఫ్రంట్‌లైన్ వర్కర్లు 1,41,49,634మంది మొదటి డోసు, 79,52,537మంది రెండో డోసు వేసుకున్నారు.
- 45 నుంచి 60 ఏళ్ల కేటగిరీలో 5,58,83,416 మంది తొలి డోసు వేసుకోగా... 78,36,168 మందికి రెండో డోసు కూడా పూర్తయింది.
- 60 ఏళ్లు పైబడిన వారిలో తొలి డోసు 5,39,59,772 మంది తీసుకోగా... 1,62,88,176మందికి బూస్టర్ డోస్ కూడా పూర్తయింది.
- 18 నుంచి 44 ఏళ్ల మధ్య గల వారిలో 30,44,463మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరికి మొదటి డోసు పూర్తయింది.
Updated Date - 2021-05-13T08:03:43+05:30 IST