జాతీయ జెండా గౌరవాన్ని కాపాడేది మీరా: ఆలపాటి
ABN, First Publish Date - 2021-03-12T09:36:25+05:30
జాతీయ జెండా గౌరవాన్ని కాపాడేది మీరా: ఆలపాటి
అమరావతి, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): మువ్వెన్నెల జెండా గౌరవాన్ని కాపాడే అర్హత మీకుందా? అని సీఎం జగన్‌ను మాజీ మంత్రి ఆలపాటి రాజా ప్రశ్నించారు. ఈ మేరకు జగన్‌కు రాజా ఓ లేఖ రాశారు. ‘‘రెపరెపలాడే జెండా అంటే యావత్ దేశ సంస్కృతికి నిదర్శనం. సమానత్వం, సౌభ్రాతత్వం, భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనానికి ప్రతీక. కానీ మీ 22 నెలల పాలనలో ఎక్కడా ఈ అంశాలను స్మృశించలేదు’’ అని విమర్శించారు. పింగళి వెంకయ్య గొప్పతనాన్ని, ఆయన కుటుంబం పడుతున్న ఇబ్బందులను 20 ఏళ్ళ కిందటే పార్లమెంటు ద్వారా దేశం దృష్టికి తీసుకువెళ్ళామని కంభంపాటి రామ్మోహనరావు తెలిపారు.
Updated Date - 2021-03-12T09:36:25+05:30 IST