ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీని దివాళా తీయిస్తున్న వైసీపీ

ABN, First Publish Date - 2021-06-14T08:53:30+05:30

వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని బీజేపీ మండిపడింది. బిల్డ్‌ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. విజయవాడలో ఆదివారం జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అప్పుల ఊబిలో రాష్ట్రం.. అభివృద్ధి శూన్యం

కొవిడ్‌ కట్టడి, రైతు సమస్యల పరిష్కారంలో విఫలం

జగన్‌ ప్రభుత్వంపై బీజేపీ కోర్‌ కమిటీ ఆగ్రహం


అమరావతి, జూన్‌ 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని బీజేపీ మండిపడింది. బిల్డ్‌ ఏపీ పేరుతో ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. విజయవాడలో ఆదివారం జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులు, వైసీపీ రెండేళ్ల పాలన, ఆర్థిక దుస్థితి, ఆస్తుల విక్రయం, అప్పుల కుప్పలు, జగన్‌ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వ్యవసాయ రంగంలో సమస్యలు తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి మురళీధరన్‌, జాతీయ సంఘటనా సంయుక్త కార్యదర్శి శివ ప్రకాశ్‌, జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి, సత్యకుమార్‌, ఎమ్మెల్సీ మాధవ్‌, కన్నా లక్ష్మీనారాయణ ఇతర కీలక నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు.


అభివృద్ధిని పూర్తిగా విస్మరించిన జగన్‌ సర్కార్‌ అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని దివాళా తీయిస్తోందని పలువురు విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఇస్తున్న నిధులతో వైసీపీ ప్రభుత్వం జగన్‌ పేరుతో ప్రజల్ని మోసం చేస్తోందని ఆరోపించారు. అప్పుల ఊబిలో రాష్ట్రాన్ని ముంచేస్తోన్న వైసీపీ ప్రభుత్వం ఆస్తులను అడ్డగోలుగా తాకట్టు బెట్టడం ఏ మాత్రం సరికాదన్నారు. నగరాలను విక్రయించేస్తూ ఏపీని అంఽధకారంలోకి తీసుకెళుతున్న వైసీపీ ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎండగట్టాలని బీజేపీ ముఖ్య నేతలు అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం భూ అక్రమాలపై చర్యలు ఎందుకు తీసుకోలేదో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోర్‌ కమిటీ డిమాండ్‌ చేసింది. కొవిడ్‌ కట్టడిలో పూర్తిగా విఫలమైన జగన్‌ సర్కారు రైతు ల సమస్యల పరిష్కారంలో మరింత అధ్వాన్నంగా త యారైందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి బీజేపీ కేడర్‌ నడుం బిగించాల్సిన సమయం అసన్నమైందన్నారు. ఈ నెల 21న యోగా డేలో అంద రూ పాల్గొనాలని పిలుపునిచ్చింది. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ప్రతి కార్యకర్త పాలుపంచుకోవాలని, ఈ నెల 28న జూ మ్‌ మీటింగ్‌లో పాల్గొన్నాలని రాష్ట్ర పార్టీ సూచించింది. 

Updated Date - 2021-06-14T08:53:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising