ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.1.55 కోట్ల ఎర్రచందనం స్వాధీనం

ABN, First Publish Date - 2021-12-19T07:04:56+05:30

ఎగుమతికి సిద్ధంగా ఉన్న రూ.1.55 కోట్ల 177 ఎర్రచందనం (2.86 టన్నుల) దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుందరరావు తెలిపారు.

ఎర్రచందనం దుంగలను మీడియాకు చూపుతున్న సుందరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓ స్మగ్లర్‌ అరెస్టు, పరారీలోని వారి కోసం గాలింపు

టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుందరరావు వెల్లడి 


తిరుపతి(కొర్లగుంట), డిసెంబరు 18: ఎగుమతికి సిద్ధంగా ఉన్న రూ.1.55 కోట్ల 177 ఎర్రచందనం (2.86 టన్నుల) దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ సుందరరావు తెలిపారు. శనివారం తిరుపతి కపిలతీర్థం సమీపంలో ఉన్న ఎర్రచందన పరిరక్షణ రక్షకదళ కార్యాలయ ప్రాంగణంలో మీడియాకు వివరాలను తెలియజేశారు. టాస్క్‌ఫోర్స్‌కు అందిన సమాచారంతో సీఐ వెంకట రవి, ఆర్‌ఎ్‌సఐ సురేష్‌ బృందం శుక్రవారం ఉదయం మామండూరు అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేస్తుండగా ఓ స్మగ్లర్‌ పట్టుబడ్డాడు. అతడిని విచారించగా, కేవీబీపురం బంగారమ్మకండ్రిగకు చెందిన సురేందర్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి ఏడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో తమిళనాడులోని పొన్నేరు తాలూకా విచ్చుర్‌ గ్రామంలో పాడుబడిన గోడౌన్‌ను అక్కడి పోలీసుల సహకారంతో తనిఖీలు చేశారు. ఆ గోడౌన్‌ మొత్తం వ్యర్థాలతో, పాతసామగ్రితో నిండిపోయి ఉంది. వాటిని తొలగించగా ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధంగా ఉంచిన 170 ఎర్రచందనం దుంగలు కనిపించాయి. వాటిని స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్‌ నిర్వాహకులు రఫీ, ఫరూక్‌లు పరారీలో ఉన్నారు. అలాగే తిరుపతి సమీపంలోని మంగళానికి చెందిన యశ్వంత్‌ ఈ స్మగ్లింగ్‌కు ప్రధాన కారకుడని విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు. ఇతడు కూడా పరారీలో ఉన్నారన్నారు. వీరికోసం గాలిస్తున్నట్లు చెప్పారు. ఇక స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ.1.55కోట్లు ఉంటుందన్నారు. 

Updated Date - 2021-12-19T07:04:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising