ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం: టీడీపీ

ABN, First Publish Date - 2021-08-28T05:27:59+05:30

వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానలపై పోరాడేం దుకు ప్రతి ఒక్కరు కలసిరావాలని తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... పెంచిన పెట్రోలియం, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె పట్టణంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు చెప్పారు.పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కురబలకోట మండల టీడీపీ అధ్యక్షుడు పి. సురేంద్ర యాదవ్‌ విమర్శంచారు.

టీడీపీ కార్యాయంలో మాట్లాడుతున్న తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి మధుబాబు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మదనపల్లె టౌన్‌, ఆగస్టు 27: వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానలపై పోరాడేం దుకు ప్రతి ఒక్కరు కలసిరావాలని తెలుగురైతు రాష్ట్ర కార్యదర్శి రాటకొండ మధుబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ...  పెంచిన పెట్రోలియం, నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ టీడీపీ ఇన్‌చార్జి దొమ్మలపాటి రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం మదనపల్లె పట్టణంలో ధర్నా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉదయం 11గంటలకు చేపట్టనున్న నిర సన కార్యక్రమానికి నియోజకవర్గంలోని టీడీపీ కార్య కర్తలందరూ తరలిరావాలని కోరారు. ఈ కార్యక్ర మంలో టీడీపీ రాజంపేట ప్రధాన కార్యదర్శి దొరస్వామినాయుడు, ఆర్‌జే వెంకటేష్‌, మోడెం సిద్దప్ప, బండి శివయ్య, పూల మురళి, వెంకటేష్‌, తాజ్‌బాషా, సోమశేఖర్‌, రాజారెడ్డి పాల్గొన్నారు.


పెట్రో ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం


కురబలకోట: పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల నియంత్రణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని  కురబలకోట మండల టీడీపీ అధ్యక్షుడు పి. సురేంద్ర యాదవ్‌ విమర్శంచారు. శుక్రవారం  అంగళ్లులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెట్రో, గ్యాస్‌ ధరలు ఆకాశాన్నంటు తున్నాయన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ అధినేత జగన్‌ రాష్ట్రపన్నులు తగ్గించాలని డి మాండ్‌ చేశారని, ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్పటినుంచి ఇష్టానుసారంగా ధరలు పెంచి ప్రజల నడ్డివిరుస్తోందన్నారు. వైసీపీ పాలనలో దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయన్నారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను తగ్గించాలని శనివారం అంగళ్లు బస్టాండ్‌ కూడలిలో నిరసన చేపట్టనున్నట్లు తెలిపారు. పార్టీలకతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటరీ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి అయూబ్‌బాషా, బొగ్గుభాస్కర్‌, రాజారెడ్డి, మోహన్‌రెడ్డి, ఆలం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-28T05:27:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising