ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉన్నత విలువలతో జీవనం సాగించాలి

ABN, First Publish Date - 2021-10-31T06:39:04+05:30

విద్యార్థులు ఉన్నత విలువలతో కూడిన జీవనం సాగించాలని ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులురెడ్డి కోరారు.

సుకుమార్‌రెడ్డి దంపతులను సన్మానిస్తున్న యండపల్లె తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాళహస్తి, అక్టోబరు 30: విద్యార్థులు ఉన్నత విలువలతో కూడిన జీవనం సాగించాలని ఎమ్మెల్సీ యండపల్లె శ్రీనివాసులురెడ్డి కోరారు. పట్టణ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సుకుమార్‌రెడ్డి పదవీవిరమణ సందర్భంగా శనివారం కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన్ను ప్రముఖులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ... అధ్యాపకుడిగా సుకుమార్‌రెడ్డి అందించిన సేవలు మరువలేమని కొనియాడారు. సమాజంలో గురువు స్థానం మహోన్నతమైందన్నారు. మార్కులు, ర్యాంకులతో విద్యార్థులు ఉద్యోగాలు మాత్రమే పొందవచ్చని అన్నారు. అయితే సంస్కారవంతంగా జీవిస్తే ఉన్నతస్థాయికి ఎదగవచ్చని సూచించారు. అధ్యాపకులకు పెండింగ్‌ అరియర్స్‌ మంజూరుకు కృషిచేస్తామన్నారు. సీపీఎస్‌ రద్దు, పీఆర్సీ అమలుకు సహకరిస్తానని గుర్తుచేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, బియ్యపు పవిత్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-31T06:39:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising