ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

3వేల టీచర్ల పోస్టుల భర్తీకి చర్యలు

ABN, First Publish Date - 2021-12-29T05:21:16+05:30

జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3వేల టీచర్‌ పోస్టులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, సంక్రాంతి పండుగ ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 28: జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3వేల టీచర్‌ పోస్టులను కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో భర్తీ చేసే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, సంక్రాంతి పండుగ ఈ ప్రక్రియ ప్రారంభం కావచ్చని జడ్పీ చైర్మన్‌ శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం జడ్పీ చైర్మన్‌ చాంబర్‌లో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. జడ్పీ పీఎఫ్‌ యాప్‌ను చైర్మన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవిడ్‌తో ఉపాధ్యాయులు మృతి చెందడం వల్ల ఏర్పడిన 167 ఖాళీల్లో కారుణ్య నియామకాల ద్వారా ఇప్పటి వరకు 63 పోస్టులను భర్తీ చేశామన్నారు. 1500 పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మెన్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. జడ్పీ సీఈవో ప్రభాకరరెడ్డి మాట్లాడుతూ 15వ ఆర్థిక సంఘం నిధులతో పాఠశాలల్లో తాగునీటి వసతిని కల్పించాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈని ఆదేశించామని చెప్పారు. సమావేశంలో హ్యాండ్‌వాష్‌ డిస్ర్టిక్ట్‌ స్పెషలాఫీసర్‌ ఎంఎన్‌ రాయ్‌, డీఈవో పురుషోత్తం, డీపీవో దశరథరామిరెడ్డి, పీడీ నాగశైలజ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-29T05:21:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising