ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైల్వేలో ప్రైవేటీకరణ తగదు: ఈఎస్‌ డిమాండ్‌

ABN, First Publish Date - 2021-09-19T05:38:51+05:30

రైల్వే ప్రైవేటీకరణ తగదని దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ గుంతకల్‌ డివిజన్‌ సెక్రటరీ పి.బాబు డిమాండ్‌ చేశారు.

రేణిగుంట రైల్వేస్టేషన్‌లో ఆందోళన చేస్తున్న ఆర్‌ఈఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 రేణిగుంట, సెప్టెంబరు 18: రైల్వే ప్రైవేటీకరణ తగదని దక్షిణమధ్య రైల్వే ఎంప్లాయీస్‌ సంఘ్‌ గుంతకల్‌ డివిజన్‌ సెక్రటరీ పి.బాబు డిమాండ్‌ చేశారు. శనివారం స్థానిక రైల్వేస్టేషన్‌లో సంఘ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైల్వేశాఖలోని పలు విభాగాలను కార్పొరేటర్లకు అప్పగించే కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఇప్పటికే 150 రైళ్లు, 7,352 రైల్వేస్టేషన్ల ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడతామని ఎన్నికల ముందు చేసిన హామీలకు విరుద్ధంగా మోదీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరంచేసేందుకు చర్యలు చేపట్టిందని వాపోయారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీ గాలికి వదిలేసిందని విమర్శించారు. రైల్వే ఉద్యోగులకు సకాలంలో డీఏలు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘ నాయకులు వేదమూర్తి, ఎన్‌సీఎంరెడ్డి, సుబ్బారావు, అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-19T05:38:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising