ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమార్తెకు సీటు రాలేదని తండ్రి ఆందోళన

ABN, First Publish Date - 2021-02-06T05:18:45+05:30

వ్యవసాయ కళాశాలలో తన కుమార్తెకు ఫార్మర్‌ కోటాలో సీటు రాలేదని ఆమె తండ్రి శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో ఆందోళనకు దిగారు.

కళాశాల ద్వారం వద్ద బైఠాయించిన తిరుమలరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్వీ వ్యవసాయ కళాశాల ద్వారం వద్ద బైఠాయింపు


తిరుపతి(విద్య), ఫిబ్రవరి 5: వ్యవసాయ కళాశాలలో తన కుమార్తెకు ఫార్మర్‌ కోటాలో సీటు రాలేదని ఆమె తండ్రి శుక్రవారం తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాలలో ఆందోళనకు దిగారు. చంద్రగిరి మండలంలోని తొండవాడకు చెందిన తిరుమలరెడ్డి అనే రైతు కళాశాల ద్వారం ఎదుట బైఠాయించి, నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుకోటాలో అడ్మిషన్‌ కోసం కళాశాలను సందర్శించినప్పుడు సీటు తప్పకుండా వస్తుందని చెప్పారన్నారు. మూడు విడతల కౌన్సెలింగ్‌ పూర్తయినా తన కుమార్తెకు సీటు రాలేదని వాపోయారు. ఈ విషయమై కళాశాలలో అడిగితే.. గుంటూరులోని ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీకి వెళ్లి తెలుసుకోవాలని సమాధానం ఇస్తున్నారన్నారు. ఆన్‌లైన్‌లో మాత్రం సమీపంలోని కళాశాలను సందర్శించాలని సూచించినట్లు పేర్కొన్నారు. పైగా సీటు రాదని తెలిస్తే వేరే కోర్సులో అడ్మిషన్‌ కోసం ప్రయత్నించే వాళ్లమని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా.. వర్సిటీ పరిధిలో ఫార్మర్‌ కోటా కింద బాలుర విభాగంలో దాదాపు 2,500 ర్యాంకులోపు, బాలికల విభాగంలో దాదాపు మూడువేల ర్యాంకులోపు వారికే సీట్లు వచ్చినట్లు సమాచారం. ఆయన కుమార్తెకు వచ్చిన ర్యాంకు ఎక్కువగా ఉందని, అందువల్ల సీటువచ్చే అవకాశం లేదని కళాశాల అధ్యాపక వర్గాలు పేర్కొన్నాయి.

Updated Date - 2021-02-06T05:18:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising