ఉప్పొంగిన బాహుదా నది

ABN, First Publish Date - 2021-11-18T06:03:57+05:30

మదనపల్లె నడిబొడ్డున పారుతున్న బాహుదా నది ఒక్కసారిగా ఉప్పొంగింది.పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు-సీటీఎం కాజ్‌వేపై మూడు అడుగుల మేర ప్రవహిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఉప్పొంగిన బాహుదా నది
సీటీఎం రోడ్డు కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న బాహుదానది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మదనపల్లె లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు


మదనపల్లె టౌన్‌, నవంబరు 17:మదనపల్లె  నడిబొడ్డున పారుతున్న బాహుదా నది ఒక్కసారిగా ఉప్పొంగింది.పట్టణానికి దక్షిణాన మాలేపాడు, పెంచుపాడు ప్రాంతాల్లో ఐదు పదున్ల వర్షం కురవడంతో బొమ్మనచెరువు, లచ్చారెడ్డి చెరువు, ఓబులనాయుని చెరువులు నిండి మొరవపోతున్నాయి.ఈ మొరవనీరు బుగ్గవంక ద్వారా పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద బహుదానదిలో కలుస్తున్నాయి. ఓ వైపు పడమట కదిరమ్మ, వెంకటమ్మచెరువులు మొరవ పోతుండటం వెరసి బాహుదానది ఉధృతంగా ప్రవహిస్తోంది. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు-సీటీఎం కాజ్‌వేపై మూడు అడుగుల మేర ప్రవహిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ మార్గంలో వాహన రాకపోకలను నిలిపివేశారు. లోతట్లు ప్రాంతాలైన మేదరవీధి, బాపనకాలువ, బుగ్గవంక... బాహుదానది పరీవాహక ప్రాంతాల్లో మూడు ఇళ్లలోకి నీరు చొరబడడంతో పాటు వార్డు సచివాలయ ఆవరణ  నిండిపోయింది.25 ఏళ్లక్రితం మదనపల్లెకు ఎగువ వున్న మూడు చెరువులు తెగిపోయి  పట్టణాన్ని ముంచెత్తాయి. ఈ ఘటనలో ఆస్తి, ప్రాణనష్టం జరిగింది. ఈ క్రమంలో గురు, శుక్రవారాల్లో కూడా వర్షాలు పడతాయని జిల్లా ఽఅధికారులు హెచ్చరించిన నేపథ్యంలో మదనపల్లె పట్టణంలోని లోతట్లు ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తున్నారు.  

Updated Date - 2021-11-18T06:03:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising