ధూళిపాళ్ల నరేంద్ర రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
ABN, First Publish Date - 2021-05-12T20:21:22+05:30
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అమరావతి: సంగం డైరీ అక్రమాల కేసు ప్రధాన నిందితుడు, టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఇటీవల కరోనా చికిత్స కోసం నరేంద్ర నగరంలోని ఆయుష్ హాస్పటల్‌లో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు బుధవారం నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ రావడంతో తిరిగి సెంట్రల్ జైలుకు తరలించారు. వారం రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యులు సూచించారు. అయితే జైల్లోనే ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉంచుతామని ఏసీబీ అధికారులు తెలిపారు.
Updated Date - 2021-05-12T20:21:22+05:30 IST