హనుమంతుడి జన్మస్థలంపై నేడు చర్చ
ABN, First Publish Date - 2021-05-27T08:54:36+05:30
కర్ణాటకలోని కిష్కింధ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతితో హనుమంతుడి జన్మస్థలంపై చర్చకు టీటీడీ సిద్ధమైంది
తిరుమల, మే 26 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని కిష్కింధ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతితో హనుమంతుడి జన్మస్థలంపై చర్చకు టీటీడీ సిద్ధమైంది. ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్న గోవిందానంద సరస్వతి... మంగళ, బుధవారాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం టీటీడీ ఎస్వీ వేదాధ్యయన ప్రాజెక్ట్ అధికారి ఆకెళ్ల విభీషణ శర్మ ఆయనను కలసి చర్చకు ఆహ్వానించారు. తిరుమల అంజనాద్రే ఆంజనేయుడి జన్మస్థలం అంటూ టీటీడీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి టీటీడీ అఽధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు లేఖలు రాశారు. హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. త్వరలోనే చర్చకు వస్తామంటూ గోవిందానంద సరస్వతి తన చివరి లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో గురువారం తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో టీటీడీ పండిత బృందం తమ వద్దనున్న ఆధారాలు బయటపెట్టి హనుమంతుడి జన్మస్థలంపై గోవిందానంద సరస్వతితో చర్చించనున్నారు.
Updated Date - 2021-05-27T08:54:36+05:30 IST