ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు, రేపు బ్యాంకుల సమ్మె

ABN, First Publish Date - 2021-03-15T05:26:24+05:30

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మార్చి 14: జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15, 16 తేదీ ల్లో తలపెట్టిన బ్యాంకుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మీడియాతో మాట్లా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవంతం చేయాలి

ఏఐటీయూసీ పిలుపు 

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), మార్చి 14: జాతీయ బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15, 16 తేదీ ల్లో తలపెట్టిన బ్యాంకుల దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్‌ రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఎల్‌ఐటీ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరిస్తామని ప్రకటించారన్నారు. మోదీ ప్రభుత్వం దేశభక్తి పేరుతో ద్రోహానికి పాల్పడుతోందన్నారు. కార్మిక సంఘాలు, వామపక్షాల పోరాట ఫలితంగా బ్యాంకులు జాతీయకరణ అయ్యాయని, నేడు బ్యాంకులు అమ్మి వేస్తే కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రస్తుతమున్న 12 జాతీయ బ్యాంకులను మరో విలీన ప్రక్రియ ద్వారా నాలుగు బ్యాంకులకు కుదించాలనే ప్రతిపాదనను కేంద్రం తక్షణం విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమ్మెకు అన్ని రా జకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, వివిధ ప్రజా సంఘాలు, ప్రజలు సంపూర్ణ మద్దతు తెలపాలని ఆయన కోరారు.

Updated Date - 2021-03-15T05:26:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising