ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఉగ్రరూపం
ABN, First Publish Date - 2021-07-25T13:22:48+05:30
గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు
రాజమండ్రి : గత నాలుగైదు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం బ్యారేజి వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. బ్యారేజీ వద్ద ఒకటో ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి వరద ఉదృతి ఉంది. దీంతో మరికాసేపట్లో అధికారులు ఒకటో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 10.40 అడుగుల దగ్గర నీటిమట్టం కొనసాగుతోంది. బ్యారేజీ 175 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 8.20 లక్షల క్యూసెక్కులు, డెల్టాలకు 4,200 క్యూసెక్కులు నీటిని విడుదల చేయడం జరిగింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే.. ఇంకా ముంపులోనే దేవీపట్నం మండలంలోని పలు గ్రామాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కూనవరం దగ్గర 44 అడుగులకు గోదావరి చేరింది. రెండో ప్రమాద హెచ్చరిక దాటి గోదావరి ప్రవహిస్తున్నది. చింతూరు దగ్గర 33 అడుగులకు శబరి నీటిమట్టం పెరిగింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
Updated Date - 2021-07-25T13:22:48+05:30 IST