ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలు, పోలీసు యంత్రాంగం సేవలు మరవలేను

ABN, First Publish Date - 2021-07-12T05:53:45+05:30

కాకినాడ క్రైం, జూలై 11: జిల్లా ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం, ఆప్యాయతను తన జీవితంలో ఎన్నటికీ మరవలేనని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పేర్కొన్నారు. గ్రేహౌండ్స్‌ విభాగానికి బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ జిల్లాలో పని చేయడం ఎంతో గర్వంగా భావించానన్నా

ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీని గజమాలతో సత్కరిస్తున్న కలెక్టర్‌ మురళీధరరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీడ్కోలు సభలో ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ

కాకినాడ క్రైం, జూలై 11: జిల్లా ప్రజలు, పోలీసు యంత్రాంగం అందించిన సహకారం, ఆప్యాయతను తన జీవితంలో ఎన్నటికీ మరవలేనని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ పేర్కొన్నారు. గ్రేహౌండ్స్‌ విభాగానికి బదిలీపై వెళ్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ జిల్లాలో పని చేయడం ఎంతో గర్వంగా భావించానన్నారు. ఇక్కడి వారు శాంతిని కోరుకుంటారని, సంక్లిష్టమైన పరిస్థితుల్లో సైతం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఎంతో సంయమనం పాటించి ఎక్కడా శాంతి భధ్రతలకు భంగం వాటిల్లకుండా మతసామరస్యానికి ప్రతీకగా నడుచుకున్నారన్నారు. కొవిడ్‌ సమయంలో కఠిన ఆంక్షల అమలులో ప్రజల కోసం పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి విశేష సేవలందించారని కితాబిచ్చారు. తొలుత సిబ్బంది నుంచి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. సత్కారం అనంతరం పూలతో అలకరించిన ఓపెన్‌ టాప్‌ జీపునకు తాళ్లు కట్టి ఆ తాడుని పోలీసు అధికారులు లాగుతూ ఎస్పీని పోలీసు కార్యాలయం నుంచి ఎస్పీ బంగాళా వరకు మర్యాదపూర్వకంగా తీసుకుని ఘనంగా వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో ఎస్‌ఈబీ ఎస్పీ గరుడ్‌ సుమిత్‌, ఏఎస్పీ కె.కుమార్‌, అడిషనల్‌ ఎస్పీ ఏఆర్‌ వీఎస్‌ ప్రభాకరరావు, ఎస్‌బీ డీఎస్పీలు అంబికాప్రసాద్‌, వెంకటేశ్వరరావు, డీఎస్పీలు వి.భీమారావు, పడాల మురళీకృష్ణారెడ్డి, రాంబాబు, మురళీమోహనరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. అనంతరం ఎస్పీకి బాహుబలి కాజాను సురుచి పీఆర్వో వర్మ అందించారు. ఎస్పీని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి గజమాలతో ఘనంగా సత్కరించారు. జేసీలు లక్ష్మీశ, కీర్తి చేకూరి, రాజకుమారి, కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఇతర ఐఏఎస్‌ అధికారులు ఎస్పీకి వీడ్కోలు అభినందనలు తెలియజేశారు. 


Updated Date - 2021-07-12T05:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising