ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫెన్సింగ్‌ పోటీలలో ఓవరాల్‌ చాంపియన్స్‌ తూర్పు

ABN, First Publish Date - 2021-11-02T05:34:16+05:30

జిల్లా ఫెన్సింగ్‌ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ పోటీలలో తూర్పు గోదావరి జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించిందని ఫెన్సింగ్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగం సతీష్‌బాబు తెలిపారు.

విజేతలకు మెడల్స్‌ అందిస్తున్న కాకినాడ సిటీ మేయర్‌ సుంకర ప్రసన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కాకినాడ స్పోర్ట్స్‌, నవంబరు 1: జిల్లా ఫెన్సింగ్‌ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫెన్సింగ్‌ పోటీలలో తూర్పు గోదావరి జట్టు ఓవరాల్‌ చాంపియన్‌షిప్‌ సాధించిందని ఫెన్సింగ్‌ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగం సతీష్‌బాబు తెలిపారు. ఈ పోటీలలో ద్వితీయస్థానంలో ప్రకాశం, తృతీయస్థానంలో పశ్చిమగోదావరి జట్లు నిలిచాయన్నారు.  విజేతలకు కాకినాడ నగరపాలక సంస్థ మేయర్‌ సుంకర శివప్రసన్న, కాకినాడ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తికుమార్‌  మెడల్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మేయర్‌ శివప్రసన్న మాట్లాడుతూ ఫెన్సింగ్‌ శిక్షణ నిమిత్తం కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలో ఒక హాలును ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజారపు మహేష్‌, ఫెన్సింగ్‌ సంఘ అధ్యక్షుడు వి.నాగేశ్వరరావు, కార్యదర్శి మోహన్‌, కోశాధికారి చంద్రకళావతి, ప్రసాద్‌కుమార్‌, వేణుగోపాలరెడ్డి, క్రిష్టఫర్‌, రామాంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-02T05:34:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising