జీఎస్టీ తగ్గించకపోతే.. రేపటినుంచి వస్త్రదుకాణాలు నిరవధిక బంద్
ABN, First Publish Date - 2021-12-31T07:15:14+05:30
కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై జీఎస్టీ 5నుంచి 12 శాతానికి పెంచిందని, దీన్ని వెంటనే విరమించుకోకపోతే జనవరి 1నుంచి వస్త్ర వ్యాపారులంతా షాపులు మూసివేసి నిరవధిక బంద్ చేపడతామని రాజమహేద్రవరం హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు.
- వస్త్ర వ్యాపారుల నిరసన, షాపులు మూసివేసి ధర్నా
రాజమహేంద్రవరం అర్బన్, డిసెంబరు 30: కేంద్ర ప్రభుత్వం వస్త్ర వ్యాపారంపై జీఎస్టీ 5నుంచి 12 శాతానికి పెంచిందని, దీన్ని వెంటనే విరమించుకోకపోతే జనవరి 1నుంచి వస్త్ర వ్యాపారులంతా షాపులు మూసివేసి నిరవధిక బంద్ చేపడతామని రాజమహేద్రవరం హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ నాయకులు హెచ్చరించారు. జీఎస్టీ పెంపునకు నిరసనగా గురువారం రాజమహేంద్రవరం హోల్‌సేల్ క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం షాపులు మూసివేసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కాలెపు వెంకట వీరభద్రరావు, కార్యదర్శి అల్లంకి నాగేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీ పెంచడంవల్ల వస్త్ర వ్యాపారులకు వ్యాపారాల్లేకుండా పోయాయన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన జీఎస్టీ విషయంలో సరైన ఆలోచన చేసి తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. కోశాధికారి కోటంశెట్టి సత్యనారాయణ, సహాయ కార్యదర్శి అల్లాడ వాసు, కమిటీ అధ్యక్షుడు కాలెపు రామచంద్రరావు, వర్తకులు, గుమస్తాలు, జట్టు కార్మికులు పాల్గొన్నారు.
వస్త్రాలపై జీఎస్టీని సత్వరం తగ్గించాలని కోరుతూ..
ద్వారపూడిలో వస్త్రవ్యాపారుల అర్ధనగ్న ప్రదర్శన
మండపేట, డిసెంబరు 30: వస్త్రాలపై ఉన్న జీఎస్టీని 5 శాతం నుంచి 12 శాతా నికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలిండియా క్లాత్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం ద్వారపూడి మహాత్మాగాంధీ కాంప్లెక్స్ వస్త్రవ్యాపారులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. సంఘ అధ్య క్షుడు చిక్కాల శ్రీనువాసరావు, గౌరవ అధ్యక్షుడు పంతంగి బోస్ నేతృత్వంలో వ్యా పారులు ఫ్లైఓవర్ నుంచి వస్త్ర మార్కెట్‌కు వరకు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కం చాలపై గరిటెలతో కొడుతూ నిరసన తెలిపారు. మూలిగే నక్కపై తాటిపండు పడినట్టు ట్యాక్స్ పెంపు ఉందని వాపోయారు. తమ సమస్యను ఎంపీలు చింతా అను రాధ, పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావులకు విన్నవిస్తామన్నారు. వ్యాపారులు ఉదయం దుకాణాలను మూసివేశా రు. సంఘ కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు సుంకర వెంకటరమణ, బీరక తమ్మయ్య, కోశాధికారి ములకల కుమార్, సాపిరెడ్డి శ్రీనువాస్, గోణం పుల్లయ్యనాయుడు, తిప్పాని బ్రదర్స్‌తోపాటు మూడొందల మంది వ్యాపారులు పాల్గొన్నారు.
Updated Date - 2021-12-31T07:15:14+05:30 IST