జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్షకు చందు ఎంపిక
ABN, First Publish Date - 2021-12-31T05:47:23+05:30
జాతీయ ప్రతిభా న్వేషణ పరీక్షలో అమలాపురం శివారు కొంకాపల్లి జవహర్‌లాల్‌నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థి చిలుకూరి వీరేంద్రచందు ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయుడు కాశి ఘనసత్య నారాయణ తెలిపారు.
అమలాపురంటౌన్, డిసెంబరు 30: జాతీయ ప్రతిభా న్వేషణ పరీక్షలో అమలాపురం శివారు కొంకాపల్లి జవహర్‌లాల్‌నెహ్రూ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఎనిమిదో తరగతి విద్యార్థి చిలుకూరి వీరేంద్రచందు ఎంపికైనట్టు ప్రధానోపాధ్యాయుడు కాశి ఘనసత్య నారాయణ తెలిపారు. రాష్ట్రవ్యాప్తం గా ఆన్‌లైన్ విధానంలో విద్యార్థి విజ్ఞాన్ మంధన్ పరీక్షకు ఆరువేల మంది విద్యార్థులు హాజరుకాగా రాష్ట్రస్థాయి శిబిరానికి 131 మందిని ఎంపిక చేసిన ట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర బృందం తరుపున చందు దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం ఉందని చెప్పారు. ప్రతిభ చాటిన చందును మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్యనాగేంద్ర మణి, కమిషనర్ వి.అయ్యప్పనాయుడు, బీఎన్ వెంకటేశ్వరరావు, కె.సుబ్రహ్మ ణ్యేశ్వరరావు, డి.నాగేంద్రరాజు, పీవీఎల్‌ఎన్ శ్రీరామ్‌లు అభినందించారు.
Updated Date - 2021-12-31T05:47:23+05:30 IST