ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధవళేశ్వరంలో కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు

ABN, First Publish Date - 2021-03-22T05:53:26+05:30

జపాన్‌ షోటోకాన్‌ కరాటే డూ కన్నిన్‌ జుబో జిల్లా ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు స్థానిక మానేపల్లి కల్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధవళేశ్వరం, మార్చి 21: జపాన్‌ షోటోకాన్‌ కరాటే డూ కన్నిన్‌ జుబో జిల్లా ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ పోటీలు స్థానిక మానేపల్లి కల్యాణ మండపంలో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం స్థానిక ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ముఖ్యఅతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలకు సంబంధించి రాజమహేంద్రవరంలో ఇండోర్‌ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కరాటే మాస్టర్‌ కర్రి నాగిరెడ్డి, పి.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో కటా, స్పారింగ్‌ అంశాల్లో అండర్‌-14,16,18 విభాగాల్లో పోటీ పడ్డారు. సీప్రీఫరీగా డీఎల్‌ నారాయణ ఇబ్రహీంబేగ్‌లు వ్యవహరించగా 75 మంది రిఫరీలు పోటీలను పర్యవేక్షించారు. ఏర్పాట్లను టోర్నీ డైరెక్టర్లు సావాడ శ్రీనివాసరెడ్డి, గుర్రాల వెంకట్రావు పర్యవేక్షించారు. విజేతలకు బహుమతులను జనసేన నాయకుడు కందుల దుర్గేష్‌, వైసీపీ రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, బీజేపీ రాజమహేంద్రవరం జిల్లా అధ్యక్షుడు పరిమి రాధ అందజేశారు. 

Updated Date - 2021-03-22T05:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising