ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాయకులు, అధికారులు సమన్వయంతో సేవలందించాలి

ABN, First Publish Date - 2021-12-19T06:46:19+05:30

ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మంచి జరిగేలా సేవలందించాలని ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొత్తపేట, డిసెంబరు 18: ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ప్రజలకు మంచి జరిగేలా సేవలందించాలని ప్రభుత్వ విప్‌, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట మండల పరిషత్‌ ప్రాంగణంలో తొలిబడ్జెట్‌ సమావేశం ఎంపీపీ మార్గాన గంగాధర్‌ అధ్యక్షతన శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జగ్గిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్టీల భేదం లేకుండా సేవలందించాలన్నారు. తొలుత మండల పరిషత్‌ సభ్యులుగా ఎన్నికైనవారిని ఆయన అభినందించారు. అనంతరం ఎం పీడీవో మహేష్‌ సభలో ప్రవేశపెట్టినతీర్మానాలను, రూ.36వేల మిగులు బడ్జెట్‌ను సభ్యులు ఆమోదించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, వ్యవసాయ, ఓటీఎస్‌ స్కీమ్‌లపై సమీక్ష నిర్వహించారు. వాడపాలెం సర్పంచ్‌ త్సామా బాబు మాట్లాడుతూ రూ.10కే జగనన్న గృహహక్కు పథకం లబ్ధిదారులందరికీ వర్తించేలా చేయాలని కోరడంతో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఓటీఎస్‌ లక్ష్యం, విధివిధానాలను గురించి అవగాహన కల్పించారు. జడ్పీటీసీ గూడపాటి రమాదేవి, ఏఎంసీ చైర్మన్‌ గొల్లపల్లి డేవిడ్‌రాజు, వైస్‌ఎంపీపీ బండారు మంగతాయారు, డీసీసీబీ డైరెక్టర్‌ బం డారు సత్తిరాజు, సర్పంచ్‌లు సాగి బంగార్రాజు, బూశి జయలక్ష్మి, తహశీల్దార్‌ జీడీ కిషోర్‌బాబు, నెల్లి లక్ష్మీపతి, ఎంఈవో ఎం.హరిప్రసాద్‌, ఏడీఏ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-19T06:46:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising