ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపరాధ రుసుం లేకుండా ఓపెన్‌ స్కూల్‌కు దరఖాస్తు

ABN, First Publish Date - 2021-11-10T05:22:21+05:30

ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్మీడియట్‌ 2021-22 సంవత్సరం ప్రవేశాలకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన గడువును ఈ నెల 15 వరకూ పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాకినాడరూరల్‌, నవంబరు 9: ఓపెన్‌ స్కూల్‌ పది, ఇంటర్మీడియట్‌ 2021-22 సంవత్సరం ప్రవేశాలకు అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు సంబంధించిన గడువును ఈ నెల 15 వరకూ పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎస్‌.అబ్రహాం తెలిపారు. దీనికి సంబందించి మంగళవారం నుంచి ఈనెల 11 వరకూ నిర్వహించే ఎన్‌రోల్‌మెంట్‌లో భాగంగా రాష్ట్ర సమన్వయకర్త పి.శ్రీనివాసరావు, జిల్లా సమన్వయకర్త పి.సాయివెంకటరమణ, కె.జనార్ధనరావు, ప్రకాష్‌ తదితరులు అధికారుల సమక్షంలో పోస్టర్‌ను ఆవిష్కరించి అందజేశారు. ఉద్యోగులకు, సామాన్యప్రజలకు ఏపీ ఓపెన్‌ స్కూల్‌ ప్రవేశం పట్ల అవగాహన కల్పించాలని తెలియజేశారు. 8008403504 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
  నేటి నుంచి ఎల్‌ఐపీ ప్రారంభం
తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం బుధవారం నుంచి ప్రారంభం కానుందని ఆర్జేడీ డి.మధుసూదనరావు తెలిపారు. సుమారు 11,20,862 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుందన్నారు. కార్యక్రమం ప్రార ంభానికి సంబంధించిన అన్ని వివరాలను సంబంధిత జిల్లాల డీఈవోలు, ఎంఈవోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇప్పటికే ఆన్‌లైన్‌లో తెలిపి అవగాహన కల్పించామన్నారు.

Updated Date - 2021-11-10T05:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising