ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తినలేని విధంగా మధ్యాహ్న భోజనం

ABN, First Publish Date - 2021-12-31T06:05:02+05:30

పిఠాపురం రూరల్‌, డిసెంబరు 30: పాఠశాల విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం మనుషులు తినలేని విధంగా ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం విరవాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను

విరవాడలో భోజనం పరిశీలిస్తున్న వర్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ

పిఠాపురం రూరల్‌, డిసెంబరు 30: పాఠశాల విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం మనుషులు తినలేని విధంగా ఉందని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎ్‌సఎన్‌ వర్మ ఆరోపించారు. పిఠాపురం మండలం విరవాడ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. వర్మ మాట్లాడుతూ ఎవ్వరు తినలేని స్థితిలో అన్నం ఉందని, కోడిగుడ్లు కుళ్లిపోయాయని, టమాటా పచ్చడి నీళ్లలా ఉందని వివరించారు. 400మంది విద్యార్థులు ఉంటే కనీసం 40మంది కూడా భోజనం చేయడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చన్నారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణను కాంట్రా క్టర్లుకు అప్పగించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. మధ్యాహ్న బోజన పథకం అమలు తీరు ఇలా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం దారుణమని వర్మ అన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలశాఖ అధ్యక్షుడు సకుమళ్ల గంగాధర్‌, జవ్వాది జోగేశ్వరరావు, కోలా రాజు, కందా శేషగిరి, నామా శ్రీను, జాను, గోపు వీరవెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-31T06:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising