ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజా వ్యతిరేక విధానాలపై జనజాగరణ యాత్ర

ABN, First Publish Date - 2021-12-07T05:56:04+05:30

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రాజమహేంద్రవరంలో కాంగ్రెస్‌ పార్టీ రాజ మహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎస్‌.మార్టిన్‌ లూథర్‌ ఆధ్వర్యంలో జన జాగరణయాత్ర నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమహేంద్రవరం సిటీ, డిసెంబరు 6: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రాజమహేంద్రవరంలో కాంగ్రెస్‌ పార్టీ రాజ మహేంద్రవరం పార్లమెంట్‌ అధ్యక్షుడు ఎస్‌.మార్టిన్‌ లూథర్‌ ఆధ్వర్యంలో జన జాగరణయాత్ర నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పాలకులు ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేశారని, ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నార న్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నిరంతరం పోరాటం చేస్తోందని, అన్ని నియోజకవర్గాల్లో జనజాగరణ యాత్రలు జరుగుతున్నా యని, ఈ నెలాఖరు వరకు ఈ యాత్రలు నిర్వహిస్తామని మార్టిన్‌లూథర్‌ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలోను కాంగ్రెస్‌ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన వారి నుంచి సభ్యత్వాలు స్వీకరించాలని సూచించారు. యాత్రలో భాగంగా అంబే డ్కర్‌ విగ్రహాలకు పూలమాలతో నివాళు లర్పించడంతోపాటు మాజీ గవర్నర్‌ రోశయ్య మృతికి సంతాపం ప్రకటించారు. ఈ యాత్రకు ముఖ్య అతిథులుగా అసంఘటిత కార్మిక సంఘ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌వీ శ్రీనివాస్‌, గోపాలపురం ఇన్‌చార్జి జ్యేష్ఠ సత్తిబాబు, నిడదవోలు ఇన్‌చార్జి పెద్దిరెడ్డి సుబ్బారావు, కొవ్వూ రు ఇన్‌చార్జి అరిగెల అరుణ, అనపర్తి ఇన్‌చార్జి డాక్టర్‌ వడయార్‌, రాజమ హేంద్రవరం రూరల్‌ ఇన్‌చార్జి తడాల కొండరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T05:56:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising