ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హౌసింగ్‌ అధికారుల దర్యాప్తు ప్రారంభం

ABN, First Publish Date - 2021-08-27T06:53:57+05:30

సామర్లకోట పట్టణ పరిధిలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హౌసింగ్‌ ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించారు. ఆంధ్రజ్యోతిలో గురువారం ‘జగనన్న కాలనీల్లో కాంట్రాక్టర్లుగా సచివాలయ సిబ్బంది’ పేరిట కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • సచివాలయ సిబ్బంది తీరుపై సమాచారం సేకరణ
  • లబ్ధిదారులతో సమీక్ష.. ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన

సామర్లకోట, ఆగస్టు 26: సామర్లకోట పట్టణ పరిధిలో జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి హౌసింగ్‌ ఉన్నతాధికారులు దర్యాప్తు నిర్వహించారు. ఆంధ్రజ్యోతిలో గురువారం ‘జగనన్న కాలనీల్లో కాంట్రాక్టర్లుగా సచివాలయ సిబ్బంది’ పేరిట కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. జిల్లా ఉన్నతాధికారులు సైతం స్పందించి విచారణకు ఆదే శించినట్లు తెలిసింది. ఈ మేరకు హౌసింగ్‌ డీఈ ఆర్‌ఎస్‌కే రాజు, ఏఈ ఎల్‌ శ్రీనివాస్‌ సామర్లకోటలోని జగనన్న కాల నీకి చేరుకుని లబ్ధిదారులతోను, తాపీమేస్త్రీలతోను సమావేశ మయ్యారు. ఇప్పటికే గృహనిర్మాణాలు నిర్వహిస్తున్న వారితో అధికారులు మాట్లాడారు. ఒక్కొక్క ఇంటికీ ఎంత మొత్తం కేటాయిస్తున్నారు, కాంట్రాక్ట్‌ ఎంతకు కుదుర్చుకున్నారు, సొంతంగా కట్టుకుంటున్నారా, సచివాలయ సిబ్బంది పాత్ర ఎంతమేర అనే అంశాలపై పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరించారు. ప్ర భుత్వం నిర్దేశించిన మేరకు చెల్లించే బిల్లులు దశలవారీగా చెల్లిస్తామని అధికారులు లబ్ధిదారులకు చెప్పారు. సచివాలయ సిబ్బం దితో ఎవరూ అనధికారికంగా ఎటువంటి ఒప్పందాలు చేసుకోరాదని సూచించారు. దర్యాప్తు ముమ్మరం చేసి పూర్తిస్థాయి నివేది కను జిల్లా ఉన్నతాధికారులకు అందజేసి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా గురువారం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథ నం మేరకు సచివాలయ సిబ్బంది ఒకరు ఇప్పటికే ఒప్పందపత్రాలు కుదుర్చుకున్న వారిని కలిసి వారిపై ఒత్తిడి తెచ్చినట్లు తెలి సింది. బిల్లులు మంజూరు చేసేది సచివాలయ సిబ్బంది కావడంతో లబ్ధిదారుల్లో కొందరు సిబ్బందివైపు మొగ్గు చూపుతుండగా మరికొందరు ఒప్పంద సమాచారాన్ని బయటపెట్టినట్లు తెలిసింది. మున్సిపల్‌ సచివాలయ సిబ్బంది కాంట్రాక్ట్‌ పనులు చేస్తున్న ట్లు సమాచారంఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కమిషనర్‌ శేషాద్రి హౌసింగ్‌ అధికారులను లేఖ ద్వారా కోరినట్లు చెప్పారు.

Updated Date - 2021-08-27T06:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising