ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పారిశుధ్య పనులు మెరుగ్గా నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-11-09T05:52:23+05:30

దోమల నివారణలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను మెరుగ్గా నిర్వహించడంతోపాటు ముం దస్తుగా వ్యాధులను అదుపుచేయడానికి అవసరమైన యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్‌ ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయాలని సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా
  • గ్రామ కార్యదర్శులు, హెల్త్‌ సిబ్బందితో సమావేశం

రాజమహేంద్రవరం అర్బన్‌, నవంబరు 8: దోమల నివారణలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను మెరుగ్గా నిర్వహించడంతోపాటు ముం దస్తుగా వ్యాధులను అదుపుచేయడానికి అవసరమైన యాంటీ లార్వా ఆపరేషన్లు, ఫాగింగ్‌ ప్రక్రియలను సమర్థవంతంగా అమలు చేయాలని సబ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా ఆదేశించారు. సోమవారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం లో గ్రామ కార్యదర్శులు, హెల్త్‌ సిబ్బందితో సమావేశం నిర్వహించి డెంగ్యూ, ఫైలేరియా వంటి కీటక జనిత వ్యాధుల నిర్మూలనా కార్యక్రమాల సన్నద్ధత, డెంగ్యూ కేసుల నమోదుపై గ్రామాల వారీగా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా సబ్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల వారీగా వలంటీర్లు, ఏఎన్‌ ఎంలు, హెల్త్‌ సహాయకులు, ఆశా వర్కర్లతో బృందాలు ఏర్పాటు చేసి ఇంటిం టికీ వెళ్లి పారిశుధ్యం, ఖాళీస్థలాల్లో మురుగునీటి నిల్వలు, డ్రైనేజీలు, పైపు లీకేజీలు, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు, సంపులు వంటి వాటిని పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెక్‌లిస్టు ప్రకారం సరిచూసుకుని దోమల వ్యాప్తిని సంపూర్ణంగా నిర్మూలించడానికి చర్యలు చేపట్టాలని అన్నారు. డివిజన్‌ పరిధిలో ఇటీవల కాలంలో 110 డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, కేసులు నమోదైన చోట మూడురోజులపాటు వలంటీర్లు పర్యవేక్షించి పూర్తిగా నిర్మూలనకు కృషి చేయా లని, కేసులు తగ్గడానికి హెల్త్‌ విభాగం కృషి చేయాలన్నారు. కార్యక్రమం లో డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ కోమల, డివిజనల్‌పంచాయతీ అధికారి జే.సత్యనారాయణ, సబ్‌ యూనిట్‌ అధికారి శ్రీనివాసరాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-09T05:52:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising