ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఊరూరా.. ప్రలోభాల ఎర

ABN, First Publish Date - 2021-02-08T06:57:39+05:30

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో నగదు, వస్తువుల పంపిణీ జోరుగా సాగుతోంది.

కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో చీరల పంపిణీ ఇలా..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిఠాపురం, ఫిబ్రవరి 7: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగియడంతో ప్రలోభాలకు తెరలేచింది. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో నగదు, వస్తువుల పంపిణీ జోరుగా సాగుతోంది. పిఠాపురం మండలంలో 24, గొల్లప్రోలు మండలంలో 10 పంచాయతీలు ఉన్నాయి. ఏపీ మల్లవరం పంచాయతీ ఎన్నిక పూర్తిగా ఏకగ్రీవమైంది. దీంతో ఇక్కడ ఎన్నికలు లేవు. దుర్గాడలో సర్పంచ్‌, 11 వార్డు సభ్య పదవుల ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. మిగిలిన వార్డులకు మాత్రమే ఇక్కడ ఎన్నిక జరగనున్నది. రెండు మండలాల్లో మిగిలిన పంచాయతీల్లో ఎన్నికలకు సంబంధిం చి ప్రచారం ఆదివారం సాయంత్రం ముగిసింది. చివరి రోజు సర్పం చ్‌ అభ్యర్థులు వార్డుల అభ్యర్థులతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించారు. పలుచోట్ల ప్రచార గడువు ముగిసిన తర్వాతా ర్యాలీలు కొనసాగాయి. ప్రదర్శనలు ముగియగానే ఓటర్లకు నగదు పంపిణీ ప్రారంభించారు. అన్ని గ్రామాల్లో ఓటుకు రూ.వెయ్యి వంతున ఇస్తుండగా పోటీ అధికంగా ఉన్నచోట్ల రూ.2-5 వేల వరకు ముట్టజెప్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్లయితే కుక్కర్లు సహా ఇతర వస్తువులను పం పిణీ చేస్తున్నారు. ఆదివారం కావడంతో పలుచోట్ల ఇంటింటికీ మాం సాన్ని అందజేశారు. సాయంత్రం బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. మద్యం, సారా పంపిణీ యథేచ్ఛగా సాగుతోంది. యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో వైసీపీ అనుకూల సర్పంచ్‌ అభ్యర్థి చీరలు, జాకెట్లు పంపిణీ చేశారు. అభ్యర్థులు పోటాపోటీగా పంపిణీకి తెరలేపడంతో సోమవారం ఇది మరింత అధికమయ్యే అవకాశం ఉంది.

Updated Date - 2021-02-08T06:57:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising